Covid-19: భయపెడుతున్న మరణాల సంఖ్య.. కరోనా సెకండ్ వేవ్‌లా ప్రమాదకరంగా మారుతోంది

దేశంలో మూడో వేవ్ కరోనా కేసులు సాగుతోండగా.. కొత్త కేసుల సంఖ్య మాత్రం తగ్గుదల కనిపిస్తోంది.

Covid-19: భయపెడుతున్న మరణాల సంఖ్య.. కరోనా సెకండ్ వేవ్‌లా ప్రమాదకరంగా మారుతోంది

Corona

Covid-19 Pandemic: దేశంలో మూడో వేవ్ కరోనా కేసులు సాగుతోండగా.. కొత్త కేసుల సంఖ్య మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. అయితే, వారంలో కరోనా సోకిన రోగుల మరణాల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. సెకండ్ వేవ్ సమయంలో నమోదైనట్లుగా కేసులు నమోదు అవుతుండగా.. కాస్త ఆందోళన కలిగిస్తోంది.

దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 2,09,918 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా 959మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 18,31,268కి తగ్గింది.

Ap High Court: న్యాయమూర్తులపై పోస్ట్‌లు.. ట్విట్ట‌ర్‌పై ఏపీ హైకోర్టు సీరియ‌స్!

యాక్టీవ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గినా కూడా రోజురోజుకూ మరణాల సంఖ్య మత్రం సెకండ్ వేవ్‌లో ఉన్నట్లే ఉంటోంది. గడిచిన వారం రోజుల్లో కోవిడ్ కారణంగా 5 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత వారం రోజుల గణాంకాలను పరిశీలిస్తే, జనవరి 31న దేశంలో 959 మరణాలు సంభవించగా, జనవరి 25న దేశంలో రికార్డు స్థాయిలో 614 మరణాలు నమోదయ్యాయి.

అప్పట్నుంచి ఏరోజు ఎన్ని మరణాలు సంభవించాయంటే..

జనవరి 31- 959
జనవరి 30- 891
జనవరి 29- 871
జనవరి 28 – 627
జనవరి 27- 573
జనవరి 26- 665
జనవరి 25- 614.

మొత్తం 7 రోజుల్లో 5200 మరణాలు సంభవించాయి. ఇప్పుడు ఈ మరణాల సంఖ్యే దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణం అవుతోంది.