Rahul Gandhi : మంత్రుల సంఖ్య పెరిగింది కానీ వ్యాక్సిన్ల సంఖ్య పెరగలేదు

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

Rahul Gandhi : మంత్రుల సంఖ్య పెరిగింది కానీ వ్యాక్సిన్ల సంఖ్య పెరగలేదు

Rahul2

Rahul Gandhi దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కేంద్రంలో మంత్రుల సంఖ్య పెరిగింది కానీ, కోవిడ్ వ్యాక్సిన్ల సంఖ్య మాత్రం పెరగలేదని ఆదివారం రాహుల్ గాంధీ ఓ ట్వీట్ లో విమర్శించారు. తాజా కేబినెట్ విస్తరణపై రాహుల్ ఈ విధంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ సందర్భంగా దేశంలో ప్రతిరోజూ ఎంత మేర వ్యాక్సినేషన్ జరుగుతుందో చెప్పే ఓ పట్టికను కూడా రాహుల్ తన ట్వీట్ లో షేర్ చేశారు. ఆ పట్టిక ప్రకారం దేశంలో కోవిడ్ థర్డ్ ఇన్ఫెక్షన్లను ఆపాలంటే డిసెంబర్ నాటికి 60శాతం దేశ జనాభాకి వ్యాక్సినేషన్ పూర్తవ్వాలి. అంటే ప్రతి రోజూ తప్పనిసరిగా దాదాపు 88లక్షల డోసులను ప్రజలకు అందించాల్సిన అవసరముంది. అయితే ప్రస్తుతం ఆ స్థాయిలో దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందడం లేదు. శనివారం దేశంలో 37లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించారు.