RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
పాత నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ప్రవేశపెట్టిన రూ.2వేల నోటు కొద్దిరోజుల్లో కనిపించకుండాపోతుందట. ఈ క్రమంలో చెలామణిలో ఉన్న నోట్లను క్రమక్రమంగా వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఆర్బీఐ. ఇందులో భాగంగానే కేంద్ర బ్యాంకు వీటి ముద్రణ ఆపేసి.. చెలామణిని తగ్గిస్తూ వస్తోంది.

RBI: పాత నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ప్రవేశపెట్టిన రూ.2వేల నోటు కొద్దిరోజుల్లో కనిపించకుండాపోతుందట. ఈ క్రమంలో చెలామణిలో ఉన్న నోట్లను క్రమక్రమంగా వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఆర్బీఐ. ఇందులో భాగంగానే కేంద్ర బ్యాంకు వీటి ముద్రణ ఆపేసి.. చెలామణిని తగ్గిస్తూ వస్తోంది. అలా ప్రస్తుతం రూ.2వేల నోట్ల సంఖ్య 214 కోట్లకు తగ్గిపోయింది.
దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో వీటి పరిమాణం కేవలం 1.6శాతం మాత్రమే అని ఆర్బీఐ వార్షిక నివేదికలో వెల్లడించింది. 2021 మార్చి చివరి నాటికి దేశంలో 245 కోట్ల రూ.2వేల నోట్లు చలామణిలో ఉండగా.. 2022 మార్చి చివరి నాటికి వీటి సంఖ్య 214 కోట్లకు తగ్గినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
2021 మార్చిలో చెలామణిలో మొత్తం కరెన్సీలో వీటి పరిమాణం 2శాతం కాగా.. ఈ ఏడాది మార్చి నాటికి అది 1.6శాతానికి తగ్గినట్లు తెలిపింది. అంటే మొత్తం కరెన్సీ విలువలో రూ.2వేల నోట్ల విలువ 17.3శాతం నుంచి 13.8శాతానికి తగ్గిపోయింది.
Read Also: సరస్సులో కట్టల కొద్ది రూ.2000 నోట్లు: ఆశ్చర్యపోయిన స్థానికులు
పెరిగిన రూ.500నోట్ల చెలామణి
రూ.2వేల నోట్ల సంఖ్య తగ్గిపోతుంటే.. రూ.500 నోట్ల చలామణి మాత్రం విపరీతంగా పెరిగిందని ఆర్బీఐ నివేదికలో పేర్కొంది. 2021 మార్చి నాటికి 3వేల 867.90కోట్ల రూ.500నోట్లు వాడుకలో ఉండగా.. 2022 మార్చి చివరి నాటికి ఏకంగా రూ.4వేల 554.68 కోట్లకు పెరిగింది. దేశంలో చెలామణిలోని మొత్తం కరెన్సీలో వీటి పరిమాణమే(34.9శాతం) ఎక్కువ.
నల్లధనాన్ని నిరోధించడంలో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2018-19 నుంచి రూ.2వేల నోట్ల ముద్రణను కేంద్రం నిలిపివేసింది.
- RBI : ఆర్బీఐ సంచలన నిర్ణయం..భారీగా పెరుగనున్న బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు
- Raghuram Rajan : దేశ ద్రవ్యోల్బణంపై రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు
- Bank Holidays April 2022 : ఏప్రిల్ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. హాలిడేస్ లిస్ట్ ఇదే..
- Protect Credit Cards : మీ క్రెడిట్, డెబిట్ కార్డులు జాగ్రత్త.. 6 సెకన్లలో హ్యాక్ చేసేస్తారు.. ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి
- Replacement : ఆర్ బీ ఐ లో పోస్టుల భర్తీ
1Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
2Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
3Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
4Mamata Banerjee: ప్రతిపక్షాలను బెదిరించేందుకు సీబీఐని పదేపదే వాడుతున్నారు: మమత
5Divi: హొయలుపోతున్న అందాల దివి!
6Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
7మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయబోతున్నారా?
8తెలంగాణలో ఫ్లెక్సీ వార్!
9Maharashtra: ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని సీఎం ఉద్ధవ్ అన్నారు: మంత్రి రాజేంద్ర
10Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
-
Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు