Supreme Court : దేశ ప్ర‌జ‌ల‌కు నుపుర్ శ‌ర్మ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశం..

బీజేపీ బహిషృత నేత నుపుర్ శ‌ర్మకు సుప్రీంకోర్టుల్లో షాక్ తగిలింది. ముహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఢిల్లీకి మార్చలన్న నూపుర్ శర్మ విజ్ఞప్తిని స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రత్యామ్నాయ పరిష్కారాలను అనుసరించే స్వేచ్ఛతో పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా నుపుర్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ‘‘నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది.

Supreme Court : దేశ ప్ర‌జ‌ల‌కు నుపుర్ శ‌ర్మ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశం..

Nupur Sharma Should Apologise To Country (1)

Nupur Sharma Should “Apologise To Country” : బీజేపీ బహిషృత నేత నుపుర్ శ‌ర్మకు సుప్రీంకోర్టుల్లో షాక్ తగిలింది. ముహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్ లను ఢిల్లీకి బదిలీ చేయాలని నూపుర్ శర్మ విజ్ఞప్తి చేశారు. దీనిని స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రత్యామ్నాయ పరిష్కారాలను అనుసరించే స్వేచ్ఛతో పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా నుపుర్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది.

ఈ సందర్భంగా సుపుర్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం ‘‘అధికార ప్రతినిధి అయితే ఏదైనా మాట్లాడతారా? అంటూ ప్రశ్నించింది. నుపుర్ శర్మ మేజిస్ట్రేట్ ముందు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. నుపుర్ శర్మ దేశ భద్రతకు ముప్పు తెచ్చారని..సుప్రీం కోర్టు టీవీ చర్చలో నుపుర్ వ్యాఖ్యాలు సిగ్గు చేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ, ఒక టివి ఛానల్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. .మీలాంటి వారు అన్ని మతాలను గౌరవించాలని సూచించిన ధర్మాసనం చీప్ పబ్లిసిటీ, పేరు మోసిన పొలిటికల్ ఎజెండా….అని అడిగితే ఈ ప్రకటనలు చేస్తారా? ఇలాంటి ప్రకటనల అవసరం ఏముంది? అంటూ ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. టివిలో సుపుర్ శర్మ చేసిన ప్రకటనలు ఆమె అహంకారాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంది.

సదరు కార్యక్రమాన్ని నిర్వహించిన ఛానల్ యాంకర్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసి ఉండాల్సిందని ఈ సందర్బంగా ధర్మాసనం అభిప్రాయపడింది. మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా ధర్మాసనం. నుపుర్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని..ఈరోజు దేశంలో ఏం జరిగినా దానికి వ్యాఖ్యలు చేసిన వారే బాధ్యత వహించాలని అన్న ధర్మాసనం తాము మొత్తం చర్చను చూశామని కొంతమందిని రెచ్చగొట్టేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోందని పేర్కొంది. నూపుర్ మాట్లాడిన మాటలు సిగ్గుచేటు అని దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఈ వ్యాఖ్యలు చేయగా..నుపుర్ తరపు న్యాయవాది మణిందర్ సింగ్ కోర్టుకు సమాధానమిస్తూ..యాంకర్ ప్రశ్నకు మాత్రమే నా క్లైంట్ సమాధానం ఇచ్చారని వివరణ ఇవ్వగా..అటువంటి కేసులో యాంకర్‌ను కూడా ప్రాసిక్యూట్ చేయాలని కోర్టు న్యాయవాదిని మందలించింది.

నూపుర్ శర్మ స్టేట్‌మెంట్..ఇచ్చిన తీరు దేశవ్యాప్తంగా సెంటిమెంట్‌లను రెచ్చగొట్టారని..దేశంలో జరుగుతున్న దానికి ఈ మహిళే కారణం అవ్వటం విచారించాల్సిన విషయం అని సుప్రీంకోర్టు సునుప్ శర్మను తీవ్రంగా మందలించింది. ఆమె వాక్చాతుర్యం వల్లే ఉదయ్‌పూర్ లాంటి విషాదకరమైన కేసు తెరపైకి వచ్చిందని..నూపుర్ శర్మ ఫిర్యాదు చేసిన వారిని అరెస్ట్ చేశారు తప్ప… ఆమెకు ఏమీ కాలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ధర్మాసంన చేసిన ఈ వ్యాఖ్యలకు నుపుర్ శర్మ న్యాయవాది మాట్లాడుతూ..‘భారత రాజ్యాంగంలో వాక్ స్వాతంత్య్రం ఉంది’ అంటూ వాదించారు న్యాయవాది మణిందర్ సింగ్. దానికి కోర్టు ఒక వ్యక్తి టీవీలో డిబేట్‌కి వెళ్లి ఏదైనా మాట్లాడితే అది సరికాదని అటువంటి హక్కు లేదని ధర్మాసనం న్యాయవాదికి సరైన సమాధానం చెప్పింది.

చాలా చోట్ల ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది… ఒకే చోట విచారణ జరగాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు మణిందర్ సింగ్. పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులు ఒకేచోటకు బదిలీ చేసేందుకు అంగీకరించేది లేదని ఈ సందర్బంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను నూపుర్ శర్మ ఉపసంహరించుకున్నారు.