Delhi Govt Hospital : నర్సులు మలయాళంలో మాట్లాడొద్దు

దేశ వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్న నర్సులు కేవలం ఇంగ్లీష్ హిందీలోనే మాట్లాడాలా...? వాళ్ల మాతృభాషలో కమ్యూనికేట్ చేయకూడదా...? కచ్చితంగా చేయకూడదంటోంది ఢిల్లీకి చెందిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి.

Delhi Govt Hospital : నర్సులు మలయాళంలో మాట్లాడొద్దు

Malayalam

Malayali Nurse : దేశ వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్న నర్సులు కేవలం ఇంగ్లీష్ హిందీలోనే మాట్లాడాలా…? వాళ్ల మాతృభాషలో కమ్యూనికేట్ చేయకూడదా…? కచ్చితంగా చేయకూడదంటోంది ఢిల్లీకి చెందిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి. నర్సులు మలయాళంలో మాట్లాడవద్దంటూ వివాదాస్పద సర్క్యులర్ జారీ చేసింది గోవింద్ బల్లబ్ పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (GIPMER). నర్సులు కేవలం ఇంగ్లీష్ లేదా హిందీలోనే మాట్లాడాలని..మలయాళంలో మాట్లాడితే తీవ్ర చర్యలు తీసుకుంటామని సర్క్యులర్ జారీ చేసింది.

దీంతో దీనిపై దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. రాజ్యాంగం గుర్తించిన భాషలను మాట్లాడవద్దని ఎలా చెబుతారంటూ జిప్మర్‌ ఆస్పత్రి వైఖరిని తప్పుపడుతున్నారు. ఇది కచ్చితంగా ప్రాధమిక హక్కుల ఉల్లంఘనేనంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. భాషా వివక్షకు అడ్డుకట్ట వేయాలంటూ ట్వీట్ చేశారు. మరి వస్తున్న విమర్శలపై ఆసుపత్రి యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Read More : 
 Ludo Game: లూడోను నిషేధించాలంటూ హైకోర్టులో పిటీషన్!