Modi’s Rainbow Cabinet : మోడీ క్యాబినెట్‌లో ఏ వర్గానికి ఎన్ని..

రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన మంత్రి వర్గాన్ని ఈరోజు సాయంత్రం విస్తరించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Modi’s Rainbow Cabinet :  మోడీ క్యాబినెట్‌లో ఏ వర్గానికి ఎన్ని..

Pm Modis New Cabinet

Modi’s Rainbow Cabinet : రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన మంత్రి వర్గాన్ని ఈరోజు సాయంత్రం విస్తరించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 15 మంది క్యాబినెట్ మంత్రులు, 28 మంది సహాయ మంత్రులతో రాష్ట్రపతి ప్రమాణం  చేయించారు. మొదట నారాయణ రాణే ప్రమాణ స్వీకారం  చేయగా…చివరిగా నిషిత్ ప్రామాణిక్ తో ముగించారు.

కేంద్ర మంత్రి వర్గంలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం  ఇచ్చారు. మంత్రుల సరాసరి వయస్సు 61 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు తగ్గింపు చేశారు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో దళిత సామాజిక వర్గానికి ప్రధాని పెద్దపీట వేశారు.

కేంద్ర కేబినెట్లో 12 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. ఈ సారి మహిళా ప్రాతినిధ్యం కూడా పెరిగింది. వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లకు కూడా నూతన మంత్రి వర్గంలో అవకాశం దక్కింది.

దేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండేలా ప్రధాని కూర్పు చేశారు. ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన 43 మంది మంత్రులలో…  7గురు ఉత్తరప్రదేశ్, 5గురు మహారాష్ట్ర , 5గురు కర్నాటక, 5గురు పశ్చిమ బెంగాల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మోడీ  క్యాబినెట్ లో మొత్తం 25 రాష్ట్రాలకు ప్రాతినిథ్యం కలిగించారు. వీరిలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. కాగా …మొత్తం మంత్రులలో… ఎస్సీ లు – 12, ఎస్టీలు – 8, ఓబీసీలు – 27 మైనారిటీలు- 5, మహిళలు – 11 మంది యూత్ -14 మంది ఉన్నారు.

ఇక విద్య పరంగా చూస్తే లాయర్లు – 13, డాక్టర్లు – 6 ఇంజనీర్లు – 5, సివిల్‌ సర్వెంట్లు – 7, సాధారణ గ్రాడ్యుయేట్లు – 68, ఎంబీయే – 3, పీహెచ్‌డీ – 7గురు ఉన్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, ఇటీవల రాజీనామా చేసిన పలువురు కేంద్ర మంత్రులు హజరయ్యారు. కాగా రాజీనామా చేసిన 12 మంది కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు.