ఒబెసిటీ ఉంటే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా నో యూజ్.. సైంటిస్టుల మాట

  • Published By: madhu ,Published On : August 11, 2020 / 08:47 AM IST
ఒబెసిటీ ఉంటే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా నో యూజ్.. సైంటిస్టుల మాట

ఒబెసిటీ ఉంటే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా పెద్దగా లాభం ఉండకపోవచ్చంటున్నారు సైంటిస్టులు. యునెటైడ్ స్టేట్స్ లో 5 మిలియన్ ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. 1, 61, 000 చనిపోవడం అందర్నీ ఆందోళన కలిగించింది.



వైరస్ ను అరికట్టడానికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు. ప్రధానంగా ఊబకాయం ఉన్న వారిలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వీరు వ్యాక్సిన్ వేసుకున్నా..అంతగా ప్రభావం చూపెట్టకపోవచ్చని, ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రొ.రాజ్ షైక్ (associate professor of nutrition at the University of North Carolina-Chapel Hill) వెల్లడించారు.

అమెరికాలో 107 మిలియన్ల ఊబకాయంతో బాధపడుతున్నారు. వీరు రోజు వారి పని చేసుకోవడం, కుటుంబ పనులు చేసుకోవడం లాంటి ఇతరత్రా ఇబ్బందులు పడుతారని వెల్లడించారు. మార్చి నెలలో చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ఎంతో మంది ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. యూఎస్ లో ప్రమాదకరమైన పరిస్థితులున్నాయని వెల్లడిస్తున్నారు.



ప్రస్తుతం న్యూ యార్క్, న్యూ జెర్సీలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లు నిండిపోయి ఉన్నందున ఊబకాయం ఉన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 40కిపైగా ఉంటే కొవిడ్ మరణాల ముప్పు అధికంగా ఉంటుందని, 100 పౌండ్ల కంటే అధికంగా బరువున్న వారికి రిస్క్ ఎక్కువంటున్నారు. ఇందులో 9 శాతం అమెరికన్ లు ఉన్నారని వెల్లడిస్తున్నారు.

శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) 30, అంతకన్నా ఎక్కువగా ఉంటే..ఊబకాయంగా పరగణిస్తారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే…42.4 శాతం వారికి ఇన్ఫెక్షన్ ఉందని అంచనా వేస్తున్నారు. వీరికి ఇన్ఫెక్షన్ తీవ్రత, మరణించే ముప్పు ఎక్కువగానే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఊబకాయం ఉన్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీనివల్ల కరోనా బారిన పడే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు.

మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బుల వంటి జబ్బుల ముప్పు పెరుగుతుందంటున్నారు. ఊబకాయుల్లో ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగానే ఉంటుదని, శ్వాసకు అంతరాయం తలెత్తడం..ఊపిరితిత్తులు సరిగ్గా వ్యాకోచించకపోవడం వంటి సమస్యలతోనూ బాధ పడుతుంటారని తెలిపారు. వీరికి అత్యవసర సమయంలో వెంటిలేటర్లు అమర్చడం కష్టమేనంటున్నారు. ఊబకాయం ఉన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.