Railway Station: ఛీ.. ఛీ..! రైల్వే స్టేషన్‌లో కళ్లు మూసుకున్న ప్రయాణీకులు.. మూడు నిమిషాలు రచ్చరచ్చ..

బీహార్ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్‌లో 10వ నెంబర్ ప్లాంట్ ఫాంపై టీవీలో ఉన్నట్లుండి అసభ్యకర వీడియో ప్లే అయింది. మూడు నిమిషాల పాటు ఈ వీడియో ప్లే అవుతున్నా రైల్వే అధికారులు గమనించలేదు. దీంతో ప్రయాణికులు ముఖం తిప్పేసుకొని అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. మూడు నిమిషాల పాటు వీడియో ప్లే కావటంతో స్టేషన్ లో గందరగోళ వాతావరణం నెలకొంది.

Railway Station: ఛీ.. ఛీ..! రైల్వే స్టేషన్‌లో కళ్లు మూసుకున్న ప్రయాణీకులు.. మూడు నిమిషాలు రచ్చరచ్చ..

Patna Railway station

Railway Station: రైల్వే స్టేషన్ రద్దీగా ఉంది. కొందరు ప్రయాణీకులు తాము ఎక్కాల్సిన రైలు‌కోసం ఎదురుచూస్తున్నారు. మరికొందరు అక్కడేఉన్న కుర్చీలపై కూర్చొని తీరిగ్గా స్టేషన్‌లోని టీవీలు చూస్తున్నారు. టీవీలో వస్తున్న ప్రకటనలను ఆసక్తిగా గమనిస్తున్నారు.. ఈ క్రమంలో వారు అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. ప్రకటనల స్థానంలో అసభ్యకర వీడియో రావటం మొదలైంది. ప్రయాణీకులు ఛీ..ఛీ అనుకుంటూ ముఖాలు తిప్పేసుకున్నారు. మూడు నిమిషాల పాటు ఆ వీడియో ప్లే కావటంతో ఆ సమయంలో రైల్వే స్టేషన్ రచ్చరచ్చగా మారింది.

Suicide In Railway Station : షాకింగ్ వీడియో.. ఏం కష్టం వచ్చిందో.. అంతా చూస్తుండగానే రైలు కిందకి దూకి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

బీహార్ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్ లో ఈఘటన చోటు చేసుకుంది. 10వ నెంబర్ ప్లాట్ ఫాంపై ఉన్న టీవీలో ఉన్నట్లుండి  అసభ్యకర వీడియో ప్లే అయింది. మూడు నిమిషాల పాటు ఈ వీడియో ప్లే అవుతున్నా రైల్వే అధికారులు గమనించలేదు. కొందరు ప్రయాణికులు ప్రభుత్వ రైల్వే పోలీస్, రైల్వే భద్రతా దళం‌కు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన జీఆర్‌పీ అధికారులు అలర్ట్ అయ్యి ఆ టీవీని బంద్ చేశారు. మూడు నిమిషాల పాటు ఆ వీడియో అలానే ప్లే కావడంతో 10వ నెంబర్ ప్లాంట్ మొత్తం ఖాళీ అయింది. అక్కడి నుంచి ప్రయాణీకులు ముఖం తిప్పుకొని లేచి వెళ్లిపోయారు.

Kalaburagi Railway Station: రైల్వే స్టేషన్‭కు ఆకుపచ్చ రంగు.. మసీదులా ఉందంటూ హిందూ సంఘాల నిరసన

టీవీల్లో ప్రకటనలు ప్రసారం చేసే దత్తా కమ్యూనికేషన్ పై రైల్వే అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేయడమే కాకుండా, సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టి కాంట్రాక్ట్ రద్దు చేశారు. అనంతరం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా కావాలని చేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి పాట్నా రైల్వే స్టేషన్‌లో మూడు నిమిషాల పాటు గందరగోళ వాతావరణం నెలకొంది.