Babies Name ‘Yaas’ : తుపాన్ రోజున పుట్టిన బిడ్డలకు..‘యాస్’ పేర్లు..ఒడిశాలో ఒక్కరోజే 750మంది జననం

Babies Name ‘Yaas’ : తుపాన్ రోజున పుట్టిన బిడ్డలకు..‘యాస్’ పేర్లు..ఒడిశాలో ఒక్కరోజే 750మంది జననం

Newborns Babies Names ‘yaas’,

odisha: cyclone name newborns babies  ‘yaas’ : నేటి యువత డ్రెస్సింగ్ లోనే కాదు తమకు పుట్టే పిల్లలకు పెట్టే పేర్ల విషయంలో కూడా ట్రెండ్ నే ఫాలో అవుతున్నారు. ఆయా రోజుల్లో ట్రెండ్ ను బట్టి పేర్లు పెడుతున్నారు. అప్పట్లో పాకిస్థాన్ సైన్యానికి చిక్కి ఏమాత్రం అదరక బెదరక సురక్షితంగా ఇండియా తిరిగి వచ్చిన భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పేరును ఆయా రోజుల్లో పుట్టిన బిడ్డలకు పెట్టుకున్నారు. అది అభినందన్ పై ఉన్న గౌరవంతో. ఇలా ఆయా సందర్భాలను గుర్తుంచుకోవటానికి కూడా పేర్లు పెడుతున్నారు. అలాగే ఇప్పుడు ‘యాస్’తుఫాను సందర్భంగా పుట్టిన పిల్లలకు ఆ తుఫాను పేరే పెట్టుకోవాలనుకున్నారు ఒడిశా వాసులు. ఏపీలో భారీ వరదలు ముంచెత్తినప్పుడు ఆడపిల్లలకు ‘వరదా దేవి’అనే పేర్లు పెట్టుకున్నారు.

ఒడిశా తీరాన్ని కల్లోలం సృష్టించి ‘యాస్’ తుపాన్ పేరు పలు నవజాత శిశువులకు పెట్టాలని పలువురు తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ‘యాస్’ తుపాన్ విపత్తు ఒడిశాను ముంచెత్తిన సమయంలో రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఒకే రోజు 750 మంది శిశువులు జన్మించారు. ఈ తుపాన్ రోజే పిల్లలు పుట్టడంతో వారికి ‘యాస్’ అనే పేరు పెట్టాలని పలువురు పిల్లల తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారని ఒడిశా వైద్యాధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి తుపాన్ బాలాసోర్ నగరానికి దక్షిణాన 50 కిలోమీటర్ల దూరంలోని బహనాగా సమీపంలో తీరం దాటిన సమయంలో పలువురు నవజాత శిశువులు జన్మించారు.

బాలాసోర్ నగరంలోని పరాఖీ ప్రాంతానికి చెందిన సోనాలిమైతికి బాబు పుట్టగా..తుపాన్ పేరు ‘యాస్’ పేరు పెట్టుకున్నారు. అలాగే కేంద్రపారా జిల్లాకు చెందిన సరస్వతి బైరాగికి పాప పుట్టిగా ‘యాస్’ అని పేరు పెట్టారు. అలా యాస్ తుఫాను రోజున పుట్టిన పిల్లలకు ఆ పేరే పెట్టాలనుకున్నారు తల్లిదండ్రులు.

‘యాస్’ పేరు ఒమన్ దేశం నుంచి వచ్చింది. ఈ పదం పెర్షియన్ భాష నుంచి ఉద్భవించిందని ఆంగ్లంలో ‘జాస్మిన్’ (జాస్మిన్ అంటే తెలుగులో మల్లెపువ్వు)అని అర్ధం. తుపాన్ సంభవించిన రోజుకు 4,555 మంది గర్భిణులు డెలివరీ సమయం దగ్గరపడగా వారిని ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. అలా బాలసోర్ జిల్లాలో 58మంది, భద్రాక్ లో 98, కటక్ లో 61మంది, జగత్సింగ్‌పూర్ లో 84, జాజ్‌పూర్ లో69, కియోంజార్లో 55 మంది,మయూరభంజ్ లో 36 మంది, కేంద్రపారాలో 166 మంది, ఖుర్దాలో 95 మంది, పూరి జిల్లాలో 10మంది శిశువులు జన్మించారని జనన నివేదికలు వచ్చాయని ఒడిశా మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.