బుల్ బుల్ తుఫాన్ : ఒడిశాలో భారీ వర్షాలు

  • Published By: madhu ,Published On : November 9, 2019 / 03:46 AM IST
బుల్ బుల్ తుఫాన్ : ఒడిశాలో భారీ వర్షాలు

బుల్ బుల్ తుఫాన్ అతి తీవ్ర తుఫాన్‌గా మారింది. ఒడిశా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 21 గంటల్లో చంద్‌బాలి ప్రాంతంలో 113 మి.మీటర్లు, డిగ్హా 48 మి.మీటర్లు.. బాలాసోర్‌లో రికార్డు స్థాయిలో 28 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. బుల్ బుల్ తుఫాన్ ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరానికి దగ్గరగా ఉన్నందున మరో 24 గంటల పాటు ఒడదిశాలో భారీ వర్షాలు పడుతాయని, ప్రధానంగా తీర ప్రాంత జిల్లాల్లో ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బలమైన గాలులు వీచడం వల్ల కరెంటు, చెట్లు కూలిపోయే
ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో అలలు ఎగిసిపడుతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. 

Read More : గుడ్ న్యూస్ : నెఫ్ట్ లావాదేవీలు ఫ్రీ 
పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌‌కు దక్షిణ నైరుతి దిశగా 450 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌కు దక్షిణ నైరుతి దిశగా 550 కిలోమీటర్ల దూరంలో బుల్ బుల్ తుఫాన్ కేంద్రీకృతమైంది. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ సాగర్ దీవులు, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఏపీ ప్రభావం ఉండదని పేర్కొంది. 
We expect heavy to very heavy rains to continue over Northern districts of #Odisha for another 24 hours as #Cyclone #Bulbul is nearing Odisha and Gangetic #WestBengal coast. https://t.co/bttKocnqWG