Odisha Transgenders: పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్‌లో ట్రాన్స్‌జెండర్లకు పర్మిషన్

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని పోలీసు ఉద్యోగాల్లోకి అప్లై చేసుకోవచ్చంటూ ఒడిశా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానిస్టేబుల్, సబ్ ఇన్ స్పెక్టర్ పదవుల ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని వెల్లడించింది. ఒడిశా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆన్ లైన్లో మగ, ఆడ, ట్రాన్స్‌జెండర్ జాతులు..

Odisha Transgenders: పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్‌లో ట్రాన్స్‌జెండర్లకు పర్మిషన్

Odisha Transgenders

Odisha Transgenders: ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని పోలీసు ఉద్యోగాల్లోకి అప్లై చేసుకోవచ్చంటూ ఒడిశా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానిస్టేబుల్, సబ్ ఇన్ స్పెక్టర్ పదవుల ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని వెల్లడించింది. ఒడిశా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆన్ లైన్లో మగ, ఆడ, ట్రాన్స్‌జెండర్ జాతులు వారీగా అప్లై చేసుకోవాలని పోస్టులు విడుదల చేసింది.

ఈ క్రమంలోనే 477 సబ్ ఇన్‌స్పెక్టర్లు, 244 కానిస్టేబుళ్ల ఖాళీలను విడుదల చేసింది. అప్లై చేసుకోవడానికి జూన్ 22 వరకూ జులై 15వరకూ ఓపెన్ లో ఉండే వెబ్ పోర్టల్ లో ప్రయత్నించాలని సూచించింది.

‘పోస్టులకు సంబంధించిన ఖాళీలు భర్తీ చేయడానికి క్వాలిఫై అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని సూచించింది. తొలిసారిగా ట్రాన్స్ జెండర్ కేటగిరీ కూడా రెండు పోస్టులకు అప్లై చేసుకోవచ్చని డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభయ్ అన్నారు.

దివ్యాంగులకు మాత్రం అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఈ పోస్టులకు కనీస అర్హత గ్రాడ్యుయేషన్. అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ తో పాటు ఫిజికల్ అండ్ ఎఫిషియన్సీ టెస్టులు పాస్ అవ్వాలి. గతంలో జైల్ వార్డర్లు పోస్టులకు అప్లై చేసుకోవచ్చని ట్రాన్స్‌జెండర్లకు అవకాశమిచ్చింది ఒడిశా గవర్నమెంట్.