Smallest Rama statue : ప్రపంచంలోనే అతి చిన్న రాముడి విగ్ర‌హం..

Smallest Rama statue : ప్రపంచంలోనే అతి చిన్న రాముడి విగ్ర‌హం..

Smallest Rama Statue

artist created world smallest statue of lord ram : శ్రీరామ న‌వ‌మి పర్వదినం రోజున శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభోగంగా జరుగుతుంది. ఈ శుభ సందర్భంగా ఒడిశాకు చెందిన ఒక సూక్ష్మ క‌ళాకారుడు ప్ర‌పంచంలోనే అతి చిన్న రాముడి విగ్ర‌హాన్ని త‌యారు చేశారు. గంజాంకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ సత్యనారాయణ మహారాణా మోహరానా చెక్క‌తో అతి చిన్న రాముడి విగ్ర‌హాన్ని చెక్కారు. రాముడు అంటేనే అందం..అందం అంటేనే రాముడు అంటారు. అటువంటి అందాల రాముడు క‌ళాకారుడి చేతిలో రూపుదిద్దుకున్న సూక్ష్మ రాముడిగా కనిపిస్తు ముచ్చటగొలుపుతున్నాడు.

2

చిన్న రామయ్యను తయారు చేసిన కళాకారుడు సత్యనారాయణ మహారాణా మాట్లాడుతూ..తాను త‌యారు చేసిన‌ రాముడి విగ్ర‌హం ఎత్తు కేవలం 4.1 సెంటీమీట‌ర్లు అనీ..ఈ విగ్రహం ప్ర‌పంచంలోనే అతి చిన్న రాముడి విగ్ర‌హ‌మ‌ని ఆయ‌న తెలిపారు. ఈ ఏడాది శ్రీరామ న‌వ‌మి సందర్భంగా చిన్న రామయ్యను తయారు చేశానని..ఈ విగ్రహం తయారు చేయటానికి ఒక గంట సమయం పట్టిందని తెలిపారు.

1

కాగా సత్యనారాయణ మైక్రో ఆర్టిస్టుగా మంచి పేరు పొందాడు.అంతేకాదు శాండ్ ఆర్ట్ తో కూడా ఆకట్టుకుంటున్నారు. కాగా సత్యనారాయణ మహారాణా గతంలో శివరాత్రి సందర్భంగా చెక్కతోను..మరొకటి రాతితోను చిన్న చిన్నశివయ్యను తయారు చేశారు. చెక్కతో 5మీల్లీ మీటర్లు పొడువు కలిగిన విగ్రహాన్ని అలాగే రాతితో 7 మిల్లీ మీటర్ల పొడవు శివుడు విగ్రహాలను తయారు చేశారు.