షోరూంలో కొని బైటకొచ్చాడంతే: యాక్టివాకు రూ.లక్ష ఫైన్!!

  • Published By: veegamteam ,Published On : September 21, 2019 / 03:57 AM IST
షోరూంలో కొని బైటకొచ్చాడంతే: యాక్టివాకు రూ.లక్ష ఫైన్!!

ఎంతో ముచ్చటపడి ఇష్టమైన రంగుతో యాక్టివా కొనుక్కుని  షోరూమ్ నుంచి బైటకు వచ్చాడంతే..వెంటనే అతడికి రూ.లక్ష ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. ఆ ఫైన్ చూసి కళ్లు తిరిగినంత పనైంది పాపం అతనికి. రూ.65 వేలు పెట్టి కొన్న బండికి రూ.లక్ష ఫైనా!! అంటూ నోరెళ్లబెట్టాడు. ఈ ఘటన ఒడిషాలోని భువనేశ్వర్ లో చోటుచేసుకుంది.
 
కొత్తగా అమలులోకొచ్చి వాహనాల చట్టం అమలులో భాగంగా ఇటువంటి షాకింగ్ న్యూస్ లు ఇటీవల వింటూనే ఉన్నాం. స్కూటర్ కు ఆటోలకు..లారీలు..కార్లు ఇలా వేలల్లో ఫైన్ లు వేస్తున్న సందర్భాల గురించి వింటూనే ఉన్నాం. ఆఖరికి రెండు ఎడ్ల బండికి కూడా ఫైన్ వేసిన విచిత్ర ఘటన గురించి కూడా జరిగింది. 
ఇప్పుడు భువనేశ్వర్‌లో ఒక వ్యక్తి హోండా ఆగస్టు 28న యాక్టివాను ఖిమ్జీ హోండా డీలర్ నుంచి  కబిటా పాండా అనే వ్యక్తి కొనుగోలు చేశారు.  సెప్టెంబర్ 12న యాక్టివా డ్రైవ్ చేసుకుంటూ వస్తుండగా.. కటక్‌లోని ఒక చెక్ పోస్టువద్ద ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఈ స్కూటర్‌పై రిజిస్ట్రేషన్ నంబరు లేదు. ఆర్టీఓ సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్లేట్ లేదంటూ..రూ.లక్ష ఫైన్ వేశారు. 

ఇంతేకాకుండా భువనేశ్వర్ ఆర్టీవో అధికారులు ఆ డీలర్‌షిప్ కు సంబంధించిన ట్రేడ్ లైసెన్సును రద్దు చేస్తామని తెలిపారు. డాక్యుమెంట్లు లేకుండా స్కూటర్‌ను ఎలా డెలివరీ చేశారని డీలర్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఒడిషా ట్రాన్సపోర్ట్  కమిషనర్ సంజీబ్ పాండా మాట్లాడుతూ..ఎంవీ చట్టం ప్రకారం ఛలానాల పెరిగాయనీ..కొత్త వాహనమైనా సరే రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా రోడ్డుపైకి రాకూడనీ..అంతేకాదు ఇన్సూరెన్స్..పొల్యూషన్ సర్టిఫికెట్ తో వంటి అన్ని పేపర్లతో సహా వాహనదారుడి వద్ద ఉండాల్సిందే లేదంటే కొత్త వాహన చట్టం ప్రకారం తాము చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.  అది డీలర్ బాధ్యతే కాదు వాహనం కొనుగోలు చేసిన వ్యక్తది కూడానని తెలిపారు.

కాగా కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం ప్రతీ వాహనానికి రిజిస్ట్రేషన్ నంబరు, ఇన్స్యూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అయ్యింది. వీటిని వాహనాన్ని అప్పగించే ముందు కొనుగోలుదారునికి డీలర్ అందజేయాల్సివుంటుంది.కానీ అలా చేయకుండా బండిని డెలివరీ ఇచ్చినందుకు కొనుగోలు చేసిన వ్యక్తికి భారీగా ఫైన్ పడింది. అంతేకాదు డీలర్  ట్రేడ్ లైసెన్సును కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఏర్పడింది. కబిటా పాండా నుంచి యాక్టివాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.