Sketch draw women skeleton : పీఎస్ వద్ద వాహనంలో అస్థిపంజరం..దాని ఆధారంగా ఆమె కోసం అన్వేషణ

Sketch draw women skeleton : పీఎస్ వద్ద వాహనంలో అస్థిపంజరం..దాని ఆధారంగా ఆమె కోసం అన్వేషణ

Police Draw Seeing Women Skeleton

police draw seeing women skeleton : కొన్నాళ్ల క్రితం ఒడిశా రాజధాని భువనేశ్వర్ నగర శివారులోని జాలాం పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ వద్ద ఆగిఉన్న వాహనంలో ఓ మనిషి అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. ఆ అస్థిపజరం ఎవరిది? అక్కడ ఎవరు పెట్టారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలా ఆ అస్థిపంజరం ఓ మహిళదని గుర్తించారు. అనంతరం ఆ మహిళ ఎవరు? అనేకోణంలో అన్వేషణ ప్రారంభించారు. దీని కోసం ఆ అస్థిపంజరానికి సబంధించిన మహిళ ఊహా చిత్రాన్ని గీయించి ఆ చిత్రం కాపీని శుక్రవారం (మార్చి 19,2021) రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఏ సమాచారం లభించినా వెంటనే తెలియజేయాలని కోరారు.

కాగా..ఈ అస్థిపంజరం ఆనవాళ్లతో ఊహాచిత్రాన్ని బెంగళూర్‌కి చెందిన కొంతమంది నిపుణులతో గీయించగా..ఆ అస్థిపంజరం ఓ మహిళదిగా తేలింది. అయితే స్థానిక ఎయిమ్స్‌(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) డాక్టర్ల సమాచారంతో ఆ అస్థిపంజరం 45 ఏళ్ల వయసున్న మహిళదని.. ఆమె ఎత్తు 164 సెంటీమీటర్లు ఉంటుందని తెలిసింది. అలాగే మృతురాలు క్షయ వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా నిర్ధారించారు డాక్టర్లు.

అస్థిపంజరాన్ని ఎలా గుర్తించారంటే..
జాలాం పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ వద్ద ఆగిఉన్న వాహనంలో ఓ మనిషి అస్థిపంజరాన్ని పోలీసులు ఎలా గుర్తించారంటే..రాష్ట్రంలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాకి సంబంధించి..పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో 2019 నవంబరులో ఓ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అందులోని అస్థిపంజరాన్ని గుర్తించినట్లు నగర డీసీపీ ఉమాశంకర దాస్‌ తెలిపారు. అంటే 2019లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాన్ని పూర్తిగా పరిశీలించకుండా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫలితంగా అప్పట్లో వాహనంలోని అస్థిపంజరాన్ని గుర్తించడంలో అలక్ష్యం వహించిన ఔట్‌పోస్ట్‌ ఇన్‌చార్జి సత్యబ్రత గ్రహచార్య సస్పెన్షన్‌ చేసినట్లుగా సమాచారం.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే..2019లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనంలో బహుశా మృతదేహం ఉండి ఉండొచ్చు..దాన్ని పూర్తిగా తనిఖీలు చేయకుండా ఆ వాహనాన్ని అలా వదిలేయటంతో ఆ మృతదేహం అస్థిపంజరంలా మారిపోయి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే దాదాపు 13 నెలల క్రితం వాహనాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే..