Odisha cop : గర్భిణీని 3 కి.మీటర్లు నడిపించినందుకు..మహిళా పోలీస్ సస్పెండ్

గర్భవతితో ఉన్న మహిళను ఏకంగా మూడు కిలోమీటర్లు నడిపించడం పట్ల ఓ మహిళా పోలీసుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Odisha cop : గర్భిణీని 3 కి.మీటర్లు నడిపించినందుకు..మహిళా పోలీస్ సస్పెండ్

Pregnant Woman Walk

pregnant woman walk : గర్భవతితో ఉన్న మహిళను ఏకంగా మూడు కిలోమీటర్లు నడిపించడం పట్ల ఓ మహిళా పోలీసుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సాటి మహిళ అయి ఉండి కూడా…ఇలా చేయడంతో అనారోగ్యానికి గురి కావడంతో భర్త తీవ్ర ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారించిన పోలీసు ఉన్నతాధికారులు..సదరు మహిళ పోలీసును సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

మయూర్ బంజ్ జిల్లాలోని సరాత్ పోలీస్ స్టేషన్. ఇక్కడ గిరిజనులు ఎక్కువగా నివాసం ఉంటుంటారు. పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జీగా రీనా భక్షాల ఉన్నారు. ఆదివారం వాహనాలను తనిఖీ చేసేందుకు రీనా రోడ్డు పక్కన నిలబడ్డారు. అదే సమయంలో బిక్రమ్ బరౌలి అనే వ్యక్తి 8 నెలల గర్భంతో ఉన్న తన భార్యతో కలిసి బైక్ పై వెళుతున్నాడు. బిక్రమ్ ను రీనా ఆపారు. హెల్మెట్ ఎక్కడా అని ప్రశ్నిస్తూ..ఫైన్ వేశారు. జరిమానాను ఆన్ లైన్ లో కడుతానని బిక్రమ్ చెప్పినా..సదరు పోలీసు అధికారి వినిపించుకోలేదు. సరాత్ పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పడంతో…బైక్ తోసుకుంటూ అతను..భార్య నడుచుకుంటూ వెళ్లారు.

సుమారు మూడు కిలో మీటర్లు నడవడంతో గర్భిణీగా ఉన్న అతని భార్య అస్వస్థతకు గురైంది. ఈ ఘటన బయటకు వెలుగు చూడడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మహిళా పోలీసుపై సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశాడు. హెల్మెట్ లేదని జరిమాన వేయడం తప్పు కాదు..కానీ..తన భార్య గర్బిణీ అని తెలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫైన్ కట్టాలని చెప్పడం దారుణం అంటూ…ఫిర్యాదులో బిక్రమ్ వెల్లడించాడు. అప్పటికే విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. రీనా భక్షలా తప్పు చేసిందని మయూర్ బంజ్ ఎస్పీ నిర్ధారణకు వచ్చి..ఆమెను సస్పెండ్ చేశారు.

Read More : Bhagoriya Festival Special in Holi : ‘భాగోరియా’వేడుక : రంగులు చల్లేస్తారు..ఓకే అంటే మూడు ముళ్లు వేసేస్తారు..