Forest Officer Dance in Rain : దావానలం త‌ర్వాత పడిన వర్షానికి వెల్కమ్ చెబుతూ మహిళా ఫారెస్ట్ అధికారి డ్యాన్స్ వైరల్

Forest Officer Dance in Rain : దావానలం త‌ర్వాత  పడిన వర్షానికి  వెల్కమ్ చెబుతూ మహిళా ఫారెస్ట్ అధికారి డ్యాన్స్  వైరల్

Forest Officer Dance In The Rain Viral Video

Forest Officer Dance in the Rain viral video : ఓ మహిళా ఫారెస్ట్ ఆఫీసర్..జోరు వానలో డాన్స్ చేయడం వైరల్ అయ్యింది. వర్షం అంటే అందరికి సంబరమే. కానీ ఈ అటవీ అధికారిని వానలో వేసిన డ్యాన్స్ వేయటానికి ఓ కారణం ఉంది. ఓ విషాదం తరువాత కురిసిన వానలో ఆమె వేసిన డ్యాన్సు చూసినవారంతా ఆమెను మెచ్చుకుంటున్నారు. వానలో తడుస్తూ ఆమె ఆనంద పారవశ్యంతో ఆడింది. సంతోషంతో కేకలు వేసింది. మబ్బులు పట్టి ఓ అందమైన వాతావరణంలో నెమలి పురి విప్పి నాట్యమాడినట్లుగా ఒడిశా సిమ్లిపాల్ నేష‌న‌ల్ పార్క్ లో పడిన వానలో ఆమె నాట్యమాడింది. ఆ నాట్యాన్ని చూసిన ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. మరి ఆమె ఆనందతాండవానికి కారణమేంటంటే..

1

ప‌ర్యావ‌ర‌ణంలో వ‌స్తున్న మార్పుల వ‌ల్ల నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల వ‌ల్ల అడవుల్లో నిప్పురాజుకుంటోంది. దీనితో అట‌వీ సంప‌ద, జీవావ‌ర‌ణం దెబ్బతింటోంది. ఒడిశా రాష్ట్రంలో స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితులే ఏర్పడ్డాయి. రెండు వారాల నుంచి ఒడిశా సిమ్లిపాల్ నేష‌న‌ల్ పార్క్ అట‌వీ ప్రాంతాన్ని మంట‌లు దహించివేశాయి. ఆ దావాలనాన్ని అదుపులోకి తీసుకురావడంలో అటవీ శాఖ విజయవంతమైంది.

2

మ‌యూర్‌బంజ్ జిల్లాలోని సిమ్లిపాల్ నేష‌న‌ల్ పార్క్‌లో ఏర్పడిన ఈ ప‌రిణామంతో చుట్టుప‌క్కలున్న అట‌వీ జీవ‌నం దెబ్బతింది. కానీ ఇప్పుడు సిమ్లిపాల్ కోలుకుంటోంది. అక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి. ఒడిశా సిమ్లిపాల్ నేష‌న‌ల్ పార్కులో 2 వారాల దావానలం త‌ర్వాత వ‌ర్షం కురుస్తోంది. ఝల్లు ఝల్లులుగా కురుస్తున్న వ‌ర్షంలో స్నేహా ధ‌ల్ అనే ఫారెస్ట్ ఆఫీస‌ర్ రెండు చేతులూ చాపి..ఆనందంతో నాట్యమాడింది. సంతోషంగా డ్యాన్స్ చేస్తూ వ‌ర్షానికి వెలమ్ చెప్పింది. న‌వ్వుతూ..తుళ్లుతూ వర్షంలో నాట్యమాడుతూ `వ‌ర్షం ఇంకా రావాలి` అంటూ గెంతులు వేసింది.

9

దీనిపై ప‌ర్యావ‌ర‌ణ వేత్తలు స్పందిస్తూ..ఆ మ‌హిళా ఫారెస్ట్ ఆఫీస‌ర్ స్నేహా ధ‌ల్ సంతోషంతో డ్యాన్స్ చేసే వీడియో ఫుటేజ్‌ని ట్విట్టర్‌లో షేర్ చేసిన డాక్టర్ యుగ‌ల్ కిషోర్ మొహంతా దీనిపై కామెంట్ చేస్తూ, “అడ‌విలో కొన్ని రోజులుగా ఏర్పడిన మంట‌ల‌ను ఆర్పే ఫైర్ ఫైటింగ్ ప‌నిలో నిమ‌గ్నమైన స్నేహ ధ‌ల్ అడ‌విలో వ‌ర్షం రావ‌డంతో అంతిమంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు” అని క్యాప్షన్ పెట్టారు.

7

ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని 1.7 ల‌క్షల మందికి పైగా చూశారు. ఈ ఫుటేజ్‌ను సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ ర‌మేష్ పాండే షేర్ చేశారు. ప్రస్తుత‌మున్న మోడీస్‌ శాటిలైట్ డేటాను బ‌ట్టి అడ‌విలో మంట‌లు అదుపులోకి వ‌చ్చాయ‌ని తెలిపారు.