Odisha: బాలుడి గొంతులోకి దూసుకుపోయిన జావెలిన్

పాఠశాలలో క్రీడాపోటీలు జరుగుతున్న సమయంలో జావెలిన్ వచ్చి ఓ బాలుడి గొంతులోకి దూసుకుపోయింది. దీంతో ఆ బాలుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన ఒడిశాలోని బాలంగీర్ జిల్లాలో చోటుచేసుకుంది.

Odisha: బాలుడి గొంతులోకి దూసుకుపోయిన జావెలిన్

Javelin

Odisha: పాఠశాలలో క్రీడాపోటీలు జరుగుతున్న సమయంలో జావెలిన్ వచ్చి ఓ బాలుడి గొంతులోకి దూసుకుపోయింది. దీంతో ఆ బాలుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన ఒడిశాలోని బాలంగీర్ జిల్లాలో చోటుచేసుకుంది. సదానంద మెహర్ అనే 9వ తరగతి విద్యార్థి అగల్ పూర్ బాలుర పంచాయతీ ఉన్నత పాఠశాల మైదానంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో విద్యార్థులు జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్నారు.

తోటి విద్యార్థి జావెలిన్ విసరగా అది సదానంద మెహర్ ఎడమ వైపు నుంచి దూసుకువచ్చింది. సదానంద మెడకు ఎడమ వైపు నుంచి గడ్డం భాగంలో బలంగా గుచ్చుకుని, కుడి వైపు నుంచి కొద్దిగా బటయకు కూడా వచ్చింది. దీంతో ఆ బాలుడిని వెంటనే బాలంగిర్ లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆ బాలుడి మెడ నుంచి జావెలిన్ ను సురక్షితంగా బయటకు తీశారు.

ప్రస్తుతం మెహర్ ఆసుపత్రిలోకి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆ బాలుడికి ఏ ప్రమాదమూ లేదని బలంగీర్ కలెక్టర్ చంచల్ రాణా చెప్పారు. పాఠశాలలో చోటుచేసుకున్న ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందిస్తూ… ఆ విద్యార్థికి అన్ని రకాల వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎంవో ట్వీట్ చేసింది. ఆ విద్యార్థి త్వరగా కోలుకోవాలని నవీన్ పట్నాయక్ అన్నారని చెప్పింది.

Minister KTR: తెలంగాణకు కేంద్ర మంత్రి మాండవీయ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్