ఒడిశాలో 45 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు : మంత్రి ప్రతాప్ జెనా

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 04:45 AM IST
ఒడిశాలో 45 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు : మంత్రి  ప్రతాప్ జెనా

ఒడిశాలో 45 ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా తెలిపారు. మహిళలు,పిల్లల కోసం ప్రత్యేకంగా 45 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయబోతున్నామని..వీటిలో 21 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మహిళలకు సంబంధించిన కేసులపై పనిచేస్తాయని తెలిపారు. వీటికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయనీ..మరో 24 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి పోక్సో చట్టం కింద నమోదైన కేసులపై పని చేస్తాయని తెలిపారు. 

దేశంలో చిన్నారులు, యువతులు, మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు..మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల కేసులను విచారించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది.

మహిళలు మరియు పిల్లలపై నేరాలకు పాల్పడిన కేసులలో నేరస్థులకు త్వరగా శిక్ష విధించడానికి ఉత్తరప్రదేశ్ 218 కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉన్నవో కేసు బాధితురాలు కోర్టుకు వెళుతుండగా అత్యాచారం చేసిన నిందితులతో సహా నలుగురు పురుషులు ఒక మహిళ నిప్పంటించిన వారం రోజుల తరువాత ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.