రైలు ప్రమాదం: ఆరుగురి పరిస్థితి విషమం

  • Published By: vamsi ,Published On : January 16, 2020 / 05:19 AM IST
రైలు ప్రమాదం: ఆరుగురి పరిస్థితి విషమం

ఒడిశా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్గుండి దగ్గర ముంబై భువనేశ్వర్ లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్(నంబరు 12879) రైలు ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయి, మరో మూడు భోగీలు పక్కకు జరిగాయి. ఈ ప్రమాదంలో 50మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది.

అయితే ఆరుగురు మాత్రమే అందులో తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.  క్షతగాత్రులను చికిత్స కోసం కటక్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.  ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ ముంబయి నుంచి భువనేశ్వర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

గూడ్స్ రైలును ఢీ కొట్టగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. పొగమంచు కారణంగా పట్టాలపై ఏమీ కనపడక ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, తీవ్ర గాయాలైన ప్రయాణికులను కటక్‌లోని ఎస్సీబి మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రికి తరలించారు.