Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదానికి మత రంగు పులిమారో…: వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

అసత్య ప్రచారం చేస్తుండడం దురదృష్టకరమంటూ తమ ట్విట్టర్ ఖాతాలో పోలీసులు ఓ పోస్ట్ చేశారు.

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదానికి మత రంగు పులిమారో…: వార్నింగ్ ఇచ్చిన పోలీసులు

Odisha Train Accident

Odisha Train Accident – Police: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express) ప్రమాదానికి మత రంగు పులుముతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వస్తున్నాయి. ఓ వర్గాన్ని ఉద్దేశిస్తూ వదంతులు వ్యాప్తి చెందుతుండడంతో ఒడిశా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

బాలాసోర్ రైలు ప్రమాదానికి మతం రంగు పులుముతూ వదంతులు వ్యాప్తి చేయొద్దని చెప్పారు. ఒకవేళ ఎవరైనా వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని, ఇప్పటికే తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

అసత్య ప్రచారం చేస్తుండడం దురదృష్టకరమంటూ తమ ట్విట్టర్ ఖాతాలో పోలీసులు ఓ పోస్ట్ చేశారు. ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని చెప్పారు. రైలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గరలో ఓ వర్గం వారు కుట్ర పన్నారంటూ, ఆ తర్వాతే ప్రమాదం జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. కాగా, బాలాసోర్ రైలు ప్రమాద ఘటనతో ధ్వంసమైన పట్టాల పునరుద్ధరణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

Odisha Train Accident: రైలు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెల్లడించిన రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా