President Droupadi Murmu : 2 కి.మీటర్లు నడిచి పూరీ జగన్నాథుడ్నిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారి తన సొంతరాష్ట్రమైన ఒడిశా వచ్చారు. పూరీ క్షేత్రంలో అడుగుపెట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం గురువారం (నవంబర్ 10,2022) భువనేశ్వర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ సాధారణ పౌరురాలిలా 2 కిలోమీటర్లు నడిచి పూరీ జగన్నాథుడ్ని దర్శిచుకున్నారు.

President Droupadi Murmu : 2 కి.మీటర్లు నడిచి పూరీ జగన్నాథుడ్నిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Murmu Walks 2 KM To Seek Blessings Of Lord Jagannath In Puri

President Droupadi Murmu : ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారి తన సొంతరాష్ట్రమైన ఒడిశా వచ్చారు. పూరీ క్షేత్రంలో అడుగుపెట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం గురువారం (నవంబర్ 10,2022) భువనేశ్వర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ సాధారణ పౌరురాలిలా 2 కిలోమీటర్లు నడిచి పూరీ జగన్నాథుడ్ని దర్శిచుకున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా సొంత రాష్ట్రానికి వచ్చిన ద్రౌపది ముర్ముకు మార్గం పొడవునా స్థానికులు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోను రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది.

రాష్ట్రపతి రాకతో భువనేశ్వర్‌లో శుక్రవారం (నవంబర్ 11,2022)స్కూళ్లు, ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా ఒడిశాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం భువనేశ్వర్‌లో 3 స్కూళ్లు, ఆదివాసీ బాలల ఆశ్రమాన్ని రాష్ట్రపతి సందర్శిస్తారు. రాష్ట్రపతి వెంట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఉన్నారు.

రాష్ట్రపతి పర్యటన ఇలా..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్ము.. బుధవారం ఉదయం ‘బిజు పట్నాయక్‌’ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఒడిశా గవర్నర్‌ గణేశీ లాల్‌, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆమెకు సాదర స్వాగతం పలికారు. అనంతరం సాయుధదళాల నుంచి రాష్ట్రపతి గౌరవవందనం స్వీకరించారు.

అక్కడి నుంచి రాష్ట్రపతి హెలికాప్టర్‌లో పూరీ క్షేత్రానికి చేరుకుని హెలిప్యాడ్ నుంచి ఆలయానికి కాన్వాయ్‌లో బయల్దేరారు. ఈక్రమంలో కొంత దూరం వెళ్లిన తర్వాత తన కాన్వాయ్‌ని ఆపించిన రాష్ట్రపతి.. అక్కడి నుంచి సుమారు 2 కి.మీ. నడిచి కాలినడుస్తూ..మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ ఆలయానికి చేరుకుని జగన్నాథుడిని దర్శించుకున్నారు. తనకు స్వాగతం పలికిన చిన్నారులను రాష్ట్రపతి ఆప్యాయంగా పలుకరించారు. సుమారు గంట పాటు ఆమె ఆలయ సన్నిధిలో గడిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.