భారత్‌లో అతిపెద్ద కరోనా హాస్పిటల్…2వారాల్లోనే అందుబాటులోకి

  • Published By: venkaiahnaidu ,Published On : March 26, 2020 / 11:22 AM IST
భారత్‌లో అతిపెద్ద కరోనా హాస్పిటల్…2వారాల్లోనే అందుబాటులోకి

దేశంలోనే అతిపెద్ద COVID-19(కరోనా వైరస్)హాస్పిటల్ నిర్మించేందుకు ఒడిషా ప్రభుత్వం రెడీ అయింది. 1000 పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్ రెడీ అవుతుంది. రెండు వారాల్లోనే ఈ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. ఈ భారీ హాస్పిటల్ లో ప్రత్యేకంగా కరోనా పేషెంట్లకు మాత్రమే ట్రీట్మెంట్ అందించనున్నారు.

దీనికి సంబంధించిన త్రైపాక్షిక ఒప్పందంపై ఒడిషా ప్రభుత్వం,కార్పొరేట్లు,మెడికల్ కాలేజీలు ఇవాళ(మార్చి-26,2020) సంతకాలు చేశారు. దేశంలో పెరుగుతున్న కొరోనా వైరస్ కేసులను తట్టుకోవడం మరియు దేశంలో ఇప్పటికే విస్తరించిన వైద్య పరికరాల భుజాల నుండి కొంత భారాన్ని తగ్గించడమే ఈ హాస్పిటల్ నిర్మించడం వెనుక ఉన్న లక్ష్యం. కాగా ఒడిషాలో ఇప్పటివరకు 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఒడిషాలో 82వేల 248మంది సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. వీరందరూ భారత్ లోని వివిధ రాష్ట్రాల నుంచి ఒడిషాకు వచ్చినవారు మరియు ఇటీవల కాలంలో విదేశాల నుంచి ఒడిషాకు వచ్చినవారు ఉన్నారు.