Odisha Train Accident: మొదట కుదుపులు.. తర్వాత భోగీ బోల్తా.. మృతదేహాల మధ్య ఇరుక్కుపోయాను.. ఆ తర్వాత: బాధితుడు

అరగంట తర్వాత తనను కొందరు బయటకు తీశారని చెప్పారు.

Odisha Train Accident: మొదట కుదుపులు.. తర్వాత భోగీ బోల్తా.. మృతదేహాల మధ్య ఇరుక్కుపోయాను.. ఆ తర్వాత: బాధితుడు

Odisha Train Accident

Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express) ప్రమాదంలో గాయపడ్డ చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదృష్టవశాత్తూ కొందరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

ముకేశ్ పండిత్ అనే వ్యక్తి ప్రమాదం జరిగిన సమయంలో ట్రైనులోనే ఉన్నారు. రైలు కుదుపులకు గురైనట్లు అనిపించిందని, అంతలోనే పట్టాలు తప్పిందని వివరించారు. రైలు భోగీ బోల్తా పడినప్పుడు పెద్ద శబ్దం వచ్చిందని అన్నారు. అరగంట తర్వాత తనను కొందరు బయటకు తీశారని చెప్పారు.

తమతో తెచ్చుకున్న వస్తువులు అన్నీ బయట పడిపోయాయని అన్నారు. చాలా మందికిగాయాలయ్యాయని చెప్పారు. తాను ప్రయాణించిన కోచ్ లో చాలా మంది మృతదేహాలు కనపడ్డాయని అన్నారు.

రైలు ప్రమాదం జరిగిన సమయంలో గిరిజా శంకర్ రథ్ అనే వ్యక్తి అక్కడే ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద పెద్ద చప్పుళ్లు వచ్చాయని చెప్పారు. అదే సమయంలో పొగ కూడా వచ్చిందని అన్నారు. ప్రయాణికుల్లో చాలా మంది ట్రైను నుంచి దూకి పరుగులు తీశారని చెప్పారు. తాము కొందరిని ట్రైను నుంచి బయటకు తీశామని అన్నారు. కొందరి మృతదేహాలను బయటకు లాగామని వివరించారు.

Odisha Train Accident: ప్రమాద బాధితులను పరామర్శించిన మోదీ.. ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు