Odisha : సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష.. పెట్టింది ఎవరో తెలుసా ?

కుత్రా పంచాయతీ మలుపడ గ్రామంలో సర్పంచి అభ్యర్థి పదవికి పలువురు పోటీ పడుతున్నారు. అభ్యర్థులందరినీ గ్రామస్తులు సమావేశపరిచారు. తాము రాత పరీక్ష పెడుతామని, అందులో పాస్ అయిన వారికే...

Odisha : సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష.. పెట్టింది ఎవరో తెలుసా ?

Sarpanch

Sarpanch Candidates Write A Test  : ఓ గ్రామంలో పంచాయతీ తరపున త్వరలో సర్పంచ్ పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో కొంతమంది పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచారు. కానీ.. వారికి పరీక్ష రూపంలో సమస్య వచ్చి పడింది. దీంతో వారికి ఏం చేయాలో తోచలేదు. చివరికి ఓకే చెప్పారు. పరీక్ష ఎవరో పెట్టింది తెలుసా ? అక్కడి గ్రామస్తులు. ఎందుకంటే సర్పంచ్ గా ఎన్నికైన అనంతరం గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తార ? గ్రామస్తుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకొంటారని తెలుసుకోవాలనే గ్రామస్తులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని సుందర్ గడ్ జిల్లాలో చోటు చేసుకుంది.

Read More : Yemen : ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్‌

కుత్రా పంచాయతీ మలుపడ గ్రామంలో సర్పంచి అభ్యర్థి పదవికి పలువురు పోటీ పడుతున్నారు. అభ్యర్థులందరినీ గ్రామస్తులు సమావేశపరిచారు. తాము రాత పరీక్ష పెడుతామని, అందులో పాస్ అయిన వారికే తాము ఓటు వేస్తామని తేల్చిచెప్పారు. దీంతో 8 మంది పరీక్షకు సిద్ధమయ్యారు. ఏడు ప్రశ్నలతో కూడిన పేపర్ ను తయారు చేశారు. అందులో ఐదేళ్ల కాలంలో మీరు ఏమి అభివృద్ధి చేశారు ? సేవలు ఏమైనా చేశారా ? ఒకవేళ సర్పంచ్ గా ఎన్నికైతే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు ? గెలిచిన తర్వాత తమ యోగక్షేమాలు పట్టించుకుంటారా ? ఇలా పలు ప్రశ్నలున్నాయి. ఇక పరీక్ష రాసిన 8 మందిలో ముగ్గురు మాత్రమే పాస్ అయ్యారు. ఐదుగురు అభ్యర్థులు పరీక్ష పాస్ కాలేదని గ్రామస్తులు ప్రకటించారు. అయితే..ముగ్గురిలో గ్రామస్తులు ఎవరికి ఓటు వేస్తారనే ఆసక్తి నెలకొంది.