Odisha Woman : కరోనా చికిత్సకు మామను భుజాలపై మోసుకెళ్లిన కోడలు

ఆమె భర్త ఉద్యోగరీత్యా దూరప్రాంతానికి వెళ్లాడు. ఇంట్లో కుటుంబ సభ్యులకు అవసరమైనవి అన్నీ తానై చూసుకుంటోంది.

Odisha Woman : కరోనా చికిత్సకు మామను భుజాలపై మోసుకెళ్లిన కోడలు

Odisha Woman

Odisha Woman Carries Father-in-law : ఆమె భర్త ఉద్యోగరీత్యా దూరప్రాంతానికి వెళ్లాడు. ఇంట్లో కుటుంబ సభ్యులకు అవసరమైనవి అన్నీ తానై చూసుకుంటోంది. భర్త సూరజ్ ఇంట్లో లేకపోవడంతో అతడి కుటుంబ భారాన్ని కోడలు నిహారికనే మోస్తోంది. ఇటీవల తన మామ తులేశ్వర్ దాస్‌కు కరోనా సోకింది.

అతడి ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స నిమిత్తం కొవిడ్ సెంటర్‌కు తన భుజాలపై మోసుకెళ్లింది కోడలు నిహారిక. కరోనావైరస్ వ్యాధి బారిన పడిన తరువాత రాహాలోని భాటిగావ్‌లో నివసిస్తున్న 75 ఏళ్ల తులేశ్వర్ దాస్‌ను ఆస్పత్రిలో చేర్పించింది. అనారోగ్యంతో ఉన్న మామను తన భుజాలపై వేసుకుని చికిత్స కోసం సమీపంలోని రాహా ఆరోగ్య కేంద్రానికి నిహారికా తీసుకెళ్లింది.

అనంతరం నిహారిక కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్థానిక ఆరోగ్య అధికారి తులేశ్వర్ దాస్‌ను జిల్లా కొవిడ్ కేర్ సెంటర్‌కు పంపించారు. నిహరికాను ఇంట్లోనే ఐసోలేషన్ కావాలని సూచించారు. కానీ మామను ఒంటరిగా ఆస్పత్రికి పంపడానికి నిహారికా నిరాకరించింది.

ఇద్దరికి ప్రాధమిక వైద్యం అందించిన తరువాత వారిని అంబులెన్స్‌లో నాగాన్ భోగేశ్వరి ఫుకానాని సివిల్ హాస్పిటల్ కొవిడ్ ఆసుపత్రికి పంపించే ఏర్పాట్లు చేశారు. ఒకవైపు కరోనా సోకిన మామను కాపాడుకునేందుకు తన ప్రాణాలను కూడా లెక్కచేయని నిహారికా దాస్‌ను అధికారులు ప్రశంసించారు.