Roti Fried: దేశంలో ఎండలు ఎలా ఉన్నాయంటే: ఎండలో కారు బోనెట్ పైనే రోటి కాల్చుకున్న మహిళ

ఒడిశాలోని సోనేపూర్ కు చెందిన ఓ మహిళ ఇంటి బయట తమ కారు పై రోటి తయారు చేసింది. అనంతరం మంట వెలిగించకుండానే ఆ రోటీని కారు బోనెట్(కారు ఇంజిన్ ఫై భాగం)పై వేసి..అచ్చు స్టవ్ పై చపాతీ కాల్చినట్లు కాల్చింది

Roti Fried: దేశంలో ఎండలు ఎలా ఉన్నాయంటే: ఎండలో కారు బోనెట్ పైనే రోటి కాల్చుకున్న మహిళ

Roti

Roti Fried: దేశంలో ఎండలు ఏ స్థాయిలో ఠారెత్తిస్తున్నాయో తెలిపే ఘటన ఇది. పట్టపగలు..సూర్యుడు మండుతూనే ఉండగా..ఓ మహిళ స్టవ్ లేకుండా..కారు బోనెట్ పై రోటి వేడి చేసింది. రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సూపర్ వైరల్ అయింది. ఒడిశాలోని సోనేపూర్ కు చెందిన ఓ మహిళ ఇంటి బయట తమ కారు పై రోటి తయారు చేసింది. అనంతరం మంట వెలిగించకుండానే ఆ రోటీని కారు బోనెట్(కారు ఇంజిన్ ఫై భాగం)పై వేసి..అచ్చు స్టవ్ పై చపాతీ కాల్చినట్లు కాల్చింది. ఆశ్చర్యంగా రోటి కూడా పొయ్యి మీద కాల్చినట్లుగా కాలింది. ఈ దృశ్యాన్ని స్థానికులు వీడియో తీయగా..’ఒడిశాలోని ప్రమేయా న్యూస్ 7′ వార్తా ఛానల్ తమ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఒడిశాకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత నీలమాధబ్ పాండా తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు.

Also read:Farmer Hires Helicopter: కుమారుడి పెళ్లి కోసం హెలికాప్టర్ అద్దెకు తీసుకున్న రైతు

“మా సొంత ఊరు సోనేపూర్ లో పరిస్థితులు. ఎంత వేడిగా ఉందంటే మంట లేకుండా కారు బోనెట్ పై రోటి కాల్చుకోవచ్చు” అంటూ పాండా ట్వీట్ చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు దేశంలో ఎండల తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒడిశాలో వేడి, ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందొ తెలిపేందుకు ఈ ఘటన ఉదాహరణ. కాగా, ఒడిశా సహా ఉత్తర భారతంలోని 14 రాష్ట్రాలకు వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణశాఖ. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో నిత్యం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత తప్పదని వాతావరణశాఖ పేర్కొంది. ప్రజలు బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉంటూ తరచూ మంచి నీళ్లు, గ్లూకోజ్, ఇతర పండ్ల రసాలను తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also read:India Border: పాకిస్తాన్ నుంచి వచ్చిన ‘మేడ్ ఇన్ చైనా’ డ్రోన్ కూల్చివేసిన భారత భద్రతా దళాలు