Birthday Party చేసిన క్వారంటైన్ మహిళ..17 మందికి వైరస్

  • Published By: madhu ,Published On : June 23, 2020 / 01:05 AM IST
Birthday Party చేసిన క్వారంటైన్ మహిళ..17 మందికి వైరస్

కరోనా వైరస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎలా వస్తుందో తెలియదు. ఎవరి నుంచి వస్తుందో తెలియదు. చాలా మంది నిర్లక్ష్యం ఫలితంగా కరోనా వైరస్ కోరలై చాస్తోంది. ఫలితంగా లక్షలాది మందికి వైరస్ సోకుతోంది. చైనా నుంచి వచ్చిన ఈ దిక్కుమాలిన వైరస్ భారతదేశంలో ఉగ్రరూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే.

రోజుకు వేలాది సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ సోకిన వారు నిబంధనలు తు.చ తప్పకుండా పాటించకపోవడం, ఏ ఏమవుతుంది లే..అనే ధీమగా వ్యవహరించడంతో ఇతరులు వైరస్ బారిన పడుతున్నారు. క్వారంటైన్ లో ఉన్న వారు నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది.

కానీ..చాలా మంది అలా చేయడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణే ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఘటన. హోం క్వారంటైన్ లో ఉన్న ఓ మహిళ తన కొడుకు పుట్టిన రోజును అట్టహాసంగా నిర్వహించింది. ఫలితంగా 17 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 

ఒడిశాలోని జార్సుగూడ గ్రామంలో కరోనా వైరస్ తలెత్తింది. గురుగ్రావ్ నుంచి వచ్చిన ఓ కుటుంబానికి ఒడిశా ప్రభుత్వ కోవిడ్ – 19 మార్గదర్శకాల ప్రకారం ఆ కుటుంబాన్ని 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. వీరు బ్రజ్ రాజ్ నగర లో నివాసం ఉంటున్నారు. కుటుంబంలోని మహిళకు కోవిడ్ – 19 వైరస్ ఉందని వైద్యులు నిర్ధారించడంతో ఆ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు.

కానీ మహిళ నిబంధనలు పాటించలేదు. తన కొడుకు పుట్టిన రోజును ఇటీవలే ఘనంగా జరిపించేసింది. స్థానికంగా ఉన్న వారిని ఆహ్వానించింది. ఈ విషయం తెలిసిన అధికారులు పరీక్షలు నిర్వహించారు. పుట్టిన రోజుకు హాజరైన వారు ఓ మ్యారేజ్ ఫంక్షన్ కు కూడా వెళ్లినట్లు తెలవడంతో అధికారులు షాక్ తిన్నారు.

ఇప్పటి వరకు 17 మందిని ట్రేస్ చేసి..వారికి పరీక్షలు నిర్వహించగా…వైరస్ సోకిందని తేలింది. ప్రస్తుతం ఇతరులను గుర్తించే పనిలో ఉన్నారు. మొత్తంగా కరోనా వైరస్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇతరులు సమస్యల్లో పడుతున్నారు. 

Read: ఇక కరోనా పరీక్షలు మరింత సులవు