పేదల ఆకలి తీర్చేందుకు : నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ‘హ్యాపీ ఫ్రిజ్ ’

  • Published By: veegamteam ,Published On : December 16, 2019 / 07:08 AM IST
పేదల ఆకలి తీర్చేందుకు : నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ‘హ్యాపీ ఫ్రిజ్ ’

కొందరికి ఆహారం ఎక్కువై పారవేస్తుంటారు. మరికొందరికి కనీసం కడుపు నింపుకునేందుకు కూడా తిండి దొరకదు. పస్తులతోనే పడుకోవాల్సి ఉంటుంది. ఇలా వ్యర్థంగా పారవేసే ఆహారాన్ని పేదల కోసం అవసరమైనవారి కోసం అంటే ఆకలితో ఉన్నవారి కోసం అందించేందుకు ఒడిశాలో ‘హ్యాపీ ఫ్రిజ్’ను ఫీడింగ్ ఇండియా అనే స్వచ్ఛంధ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ఈ క్రమంలో ఒడిశాలోని నక్సల్స్ ప్రభావితం ప్రాంతమైన గజపతి జిల్లా పారలఖేముండి ప్రాంతంలోని ఓ హాస్పిటల్ వద్ద ఆదివారం ఫీడింగ్ ఇండియా సంస్థ ‘హ్యాపీ ఫ్రిజ్’ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా..ఎస్పీ సారా శర్మ మాట్లాడుతూ..ఆహారాన్ని వ్యర్థంగా పారవేసే బదులు ఆకలితో ఉన్నవారికి అందించాలని పిలుపునిచ్చారు.

ఆహారాన్ని వ్యర్థంగా పడేయకుండా ఉండేందుకు అన్నార్తులకు అందజేసేందుకు ఈ ‘హ్యాపీ ఫ్రిజ్’ను ఏర్పాటు చేసామని తెలిపారు. హాస్పిటల్ కు ఎంతోమంది పేదలు వస్తుంటారనీ వారి కోసం ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని విరాళంగా అందజేయాలని పిలుపునిచ్చారు. కాగా..ఫీడింగ్ ఇండియా సంస్థ  ‘హ్యాపీ ఫ్రిజ్’ను ఏర్పాటు చేసి..ఆహారాన్ని అందిస్తోంది.