Omicron Cases : 80శాతం ఒమిక్రాన్ కేసుల్లో లక్షణాలే లేవు, ఆందోళన వద్దన్న కేంద్రమంత్రి

దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 161 బయటపడగా.. అందులో 80 శాతం కేసుల్లో అసలు లక్షణాలే లేవని మాండవీయ తెలిపారు. మరో 13 శాతం కేసుల్లోనూ స్వల్ప లక్షణాలే ఉన్నట్టు చెప్పారు.

Omicron Cases : 80శాతం ఒమిక్రాన్ కేసుల్లో లక్షణాలే లేవు, ఆందోళన వద్దన్న కేంద్రమంత్రి

Omicron Cases In Country

Omicron Cases : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒమిక్రాన్ రకం కరోనా కేసులు యూరప్, అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లో వేగంగా పెరుగుతుండం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. మన దేశంలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని కంగారు పెడుతున్నారు.

ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ చేసిన ప్రకటన కాస్త రిలీఫ్ ఇచ్చేదిగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 161 బయటపడగా.. అందులో 80 శాతం కేసుల్లో అసలు లక్షణాలే లేవని మాండవీయ తెలిపారు. మరో 13 శాతం కేసుల్లోనూ స్వల్ప లక్షణాలే ఉన్నట్టు చెప్పారు. ఇక ఒమిక్రాన్ బారిన పడిన వారిలో 44 మంది కోలుకున్నట్టు తెలిపారు. కాకపోతే ఒమిక్రాన్ ఇతర రకాలతో మ్యూటేట్ అయితే పెద్దవారు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారిలో తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితులను ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోందన్నారు.

Hairfall: తక్కువ వయస్సులోనే జుట్టు ఊడిపోవడానికి కారణాలు

ఒమిక్రాన్ రకం వైరస్ పై వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ల్యాబ్ లలో పరీక్షలు జరుగుతున్నాయని, మరో వారంలో వాటి ఫలితాలు వస్తాయని మంత్రి తెలిపారు. నిపుణులతో రోజువారీగా సమీక్ష నిర్వహిస్తున్నామని.. ఔషధాలు, ఆక్సిజన్ ను తగినంత అందుబాటులో ఉంచినట్టు వివరించారు.

మరోపక్క, రాష్ట్రాలకు ఇప్పటి వరకు 48వేల వెంటిలేటర్లను పంపిణీ చేసినట్టు తెలిపారు. టీకాల ఉత్పత్తి సామర్థ్యం నెలవారీగా 31 కోట్లుగా ఉండగా, వచ్చే రెండు నెలల్లో అది 45 కోట్లకు పెరుగుతుందన్నారు. దేశంలో ఇప్పటికే 88 శాతం మంది (18 ఏళ్లు నిండిన వారిలో) టీకా మొదటి డోసు తీసుకున్నారని.. 58 శాతం మందికి రెండు డోసులు పూర్తయినట్టు కేంద్రమంత్రి వెల్లడించారు.

కాగా, మన దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వైరస్ పాకింది. ఇప్పటివరకు 200 వరకు కేసులు నమోదయ్యాయి. వీటిలో సగం కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 54 కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలంగాణలో 20 కేసులు, కర్ణాటకలో 19, రాజస్తాన్ లో 18, కేరళలో 15, గుజరాత్ లో 14 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ బాధితుల్లో 77 మంది కోలుకున్నారు.

Vitamin Pills : విటమిన్ మాత్రలు ఎవరికి అవసరమో తెలుసా?

దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు 100 దేశాలకు వ్యాప్తి చెందింది. యూరప్ లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అమెరికాలో సైతం ఈ రకం కేసులు భారీగా పెరుగుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుండటంతో అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి. కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. మళ్లీ ఆంక్షల వలయంలోకి వెళ్తున్నాయి.