Officers Village In India: ఇంటికో సివిల్ ఆఫీసర్.. ఇండియాలోని ఆఫీసర్స్ విలేజ్ గురించి తెలుసా..

ప్రపంచంలోనే క్లిష్టమైన పరీక్ష ఏదైనా ఉందంటే.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌దే. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (సీఎస్ఈ) నిర్వహించే ఈ పరీక్షకు వెయ్యి కంటే తక్కువ పోస్టులకు పది లక్షలకు పైగా పోటీపడుతుంటారు.

Officers Village In India: ఇంటికో సివిల్ ఆఫీసర్.. ఇండియాలోని ఆఫీసర్స్ విలేజ్ గురించి తెలుసా..

Ias Officers

Officers Village In India: ప్రపంచంలోనే క్లిష్టమైన పరీక్ష ఏదైనా ఉందంటే.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌దే. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (సీఎస్ఈ) నిర్వహించే ఈ పరీక్షకు వెయ్యి కంటే తక్కువ పోస్టులకు పది లక్షలకు పైగా పోటీపడుతుంటారు. ఫైనల్ జాబితాలో పేర్లు ఉండే వాళ్లు అదృష్టవంతులే. అలా లక్షల సంఖ్యలో వెనుదిరగాల్సిందే.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిన్న గ్రామం నుంచి దేశమంతా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను అందిస్తుంది. జౌన్పూర్ జిల్లాలోని మధోపట్టి (Madhopatti) గ్రామంలో 75ఇళ్ల నుంచి ఐఏఎస్ లేదా పీసీఎస్ క్యాడర్ అధికారులు ఉన్నారు. కేవలం ఆ గ్రామానికి చెందిన కొడుకులు, కూతుళ్లే కాదు. కోడళ్లుగా వచ్చిన వారు కూడా ఆఫీసర్ పోస్టులు దక్కించుకుంటున్నారు.

Ghahmar అనే గ్రామాన్ని విలేజ్ ఆఫ్ జవాన్స్ గా పిలుస్తారు. ఎందుకంటే ఇంటికో ఆర్మీ జవాన్ ఉండటమే గ్రామ ప్రత్యేకత.

జౌన్పూర్‌లోని మధోపట్టి గ్రామంలో బోలెడు మంది యంగ్‌స్టర్స్ సివిల్ సర్వీసెస్ ను ఎంచుకుంటారు. కొందరైతే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) లలో చేరిపోతుంటారు. అంతేకాదు ఈ గ్రామంలోని నలుగురు అన్నదమ్ములు ఐఏఎస్ కు సెలక్ట్ అయిపోయారు.

1955లో సివిల్ సర్వీసెస్ సాధించిన వినయ్ కుమార్ ప్రస్తుతం బీహార్ కు చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అతని ఇద్దరు అన్నదమ్ములైన ఛత్రపాల్ సింగ్, అజయ్ కుమార్ సింగ్ 1964లో ఐఏఎస్ సాధించారు. నాలుగో తమ్ముడు 1968లో సాధించి రికార్డు నెలకొల్పారు.

మధోపట్టి గ్రామంలో తొలి ఐఏఎస్ పొందిన వ్యక్తి ముస్తఫా హుస్సేన్ 1914లో సాధించారు. ఆ తర్వాత 1952లో ఇందూ ప్రకాశ్ అనే ఆఫీసర్ వల్ల రెండో స్థానం దక్కింది. అప్పటి నుంచి గ్రామం సివిల్ సర్వీస్ కు సీరియస్ గా ఎంకరేజ్మెంట్ మొదలుపెట్టింది.

ఇంత ఘనత సాధించినప్పటికీ విద్యుత్ సదుపాయం పూర్తిగా ఉండదు. పైగా ఐఏఎస్ అప్లై చేసేవారి కోస కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదు.