Corona New Variant : దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం

ఢిల్లీలోనూ ఈ స‌బ్‌ వేరియంట్‌కు చెందిన మూడు కేసులు వెలుగుచూశాయి. అయితే ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని, త‌గిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు.

Corona New Variant : దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం

Corona New Variant

Corona new variant : భారత్‌లో కొవిడ్‌-19 మ‌ళ్లీ విజృంభిస్తోంది. ఢిల్లీలో ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య భయపెడుతోంది. ఇంతలోనే క‌రోనా కొత్త స‌బ్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు బీహార్ అధికారులు ప్రకటించారు. ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ లో బీఏ.12 వేరియంట్ బ‌య‌ట‌ప‌డినట్లు తెలిపారు. ఇది క‌రోనా థ‌ర్డ్ వేవ్‌లో వెలుగుచూసిన బీఏ.2 స‌బ్‌ వేరియంట్‌కంటే ప‌దిరెట్లు ప్రమాద‌క‌ర‌మ‌ని హెచ్చరించారు.

ఢిల్లీలోనూ ఈ స‌బ్‌ వేరియంట్‌కు చెందిన మూడు కేసులు వెలుగుచూశాయి. అయితే ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని, త‌గిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో తాము క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేశామని మైక్రోబ‌యాల‌జీ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ న‌మ్ర‌తా కుమారి వెల్ల‌డించారు. 13 శాంపిళ్ల‌ను ప‌రీక్షించామని తెలిపారు.

India Covid-19 : 46 రోజుల తర్వాత.. దేశంలో 3వేల మార్క్ దాటిన కరోనా కేసులు!

అందులో ఒక‌టి బీఏ.12 స‌బ్ వేరియంట్‌గా గుర్తించామని, మిగ‌తా 12 శాంపిళ్లు బీఏ.2 స‌బ్ వేరియంట్‌ అని ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ న‌మ్ర‌తా కుమారి పేర్కొన్నారు. ఇది బీఏ.2కంటే ప‌దిరెట్లు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తెలిపారు. అయినా, ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని, త‌గి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. బీఏ.12 స‌బ్‌ వేరియంట్‌ను మొద‌ట యూఎస్‌లో గుర్తించారు. ఢిల్లీలో ఈ స‌బ్‌వేరియంట్‌కు సంబంధించిన మూడు కేసులు వెలుగుచూశాయి.

దేశంలో కరోనా కేసులు పెరగడం కలవరపెడుతోంది. 46 రోజుల తర్వాత తొలిసారి 3 వేల మార్క్‌ను దాటాయి. అటు యాక్టివ్‌ కేసుల సంఖ్య 17వేలకు చేరువైంది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, కేరళ, మిజోరంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 14 వందల 90 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. పాజిటివిటీ రేటు 4.5శాతం దాటింది.

Corona Vaccine : 5-12 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. నిర్ణయంపై ఉత్కంఠ

చాలా కేసుల్లో తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు. ప్రస్తుతం కోవిడ్ లక్షణాలలో జ్వరం, తుమ్ములు, గొంతు నొప్పి, దగ్గు లాంటి తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటున్నారు వైద్యులు. కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.