Ceiling Fans : ఏందయ్యా ఇది.. ఆత్మహత్యలను అడ్డుకోవాలని హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లు తొలగించిన అధికారులు

క్యాంపస్ అధికారుల నిర్వాకం విస్మయానికి గురి చేస్తోంది. వారు చేసిన పని అందరిని నిర్ఘాంతపరుస్తోంది. ఇదెక్కడి చోద్యం అని ముక్కున వేలేసుకునేలా చేసింది.

Ceiling Fans : ఏందయ్యా ఇది.. ఆత్మహత్యలను అడ్డుకోవాలని హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లు తొలగించిన అధికారులు

Ceiling Fans

Ceiling Fans : కర్నాటక రాజధాని బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISc) క్యాంపస్ అధికారుల నిర్వాకం విస్మయానికి గురి చేస్తోంది. వారు చేసిన పని అందరిని నిర్ఘాంతపరుస్తోంది. ఇదెక్కడి చోద్యం అని ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇంతకీ వాళ్లు ఏం చేశారో తెలుసా? క్యాంపస్ లోని హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లు తొలగించేశారు. అందులో పెద్ద వింతేముంది అని సందేహం రావొచ్చు.

Cybersecurity Experts Warn : హాలీవుడ్ మూవీ ‘Spider Man’ పేరుతో సైబర నేరగాళ్ల స్కెచ్.. తస్మాత్ జాగ్రత్త!

సీలింగ్ ఫ్యాన్లు ఎందుకు తొలగించారో తెలుసా? ఆత్మహత్యలను నిరోధించాలనే ఉద్దేశ్యంతోనే అధికారులు ఈ పని చేశారట. అధికారులు చేసిన ఈ పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విద్యార్థులు షాక్ కి గురయ్యారు. ఈ చర్యను వారు తప్పుపట్టారు. ఇలాంటి చర్యల ద్వారా ఆత్మహత్యలు అరికట్టలేమని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. గత రెండేళ్లలో క్యాంపస్ లో ఆరుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. దీంతో క్యాంపస్ అధికారులు సీలింగ్ ఫ్యాన్ల తొలగింపు నిర్ణయం తీసుకున్నారు.

Lose Weight : బరువు తగ్గాలంటే… ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లోకి ఇవి తీసుకోండి

కాగా, సీలింగ్ ఫ్యాన్లు తొలగించిన అధికారులు వాటి స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు బిగిస్తున్నారు. సీలింగ్ ఫ్యాన్లు తొలగింపు విషయమై విద్యార్థులు అభిప్రాయ సేకరణ చేశారు. అందులో 89శాతం మంది సీలింగ్ ఫ్యాన్లు తొలగించడాన్ని వ్యతిరేకించారు. మరికొందరు ఫ్యాన్ ఉంచినా తీసేసినా తమకు పెద్ద ఇబ్బందేమీ లేదన్నారు. కాగా, సీలింగ్ ఫ్యాన్లు తొలగించడం వల్ల ఆత్మహత్యలు అరికట్టలేమని 86శాతం మంది విద్యార్థులు తమ అభిప్రాయం తెలిపారు.