Jog Falls : జలపాతాన్ని వీక్షించేందుకు నీరు విడుదల..చిక్కుల్లో గవర్నర్!

నవంబర్ 25వ తేదీన కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ శివమొగ్గ జిల్లాలో పర్యటించారు. గెహ్లాట్ నగరంలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం

Jog Falls : జలపాతాన్ని వీక్షించేందుకు నీరు విడుదల..చిక్కుల్లో గవర్నర్!

Jog Fall

Karnataka Governor : ప్రజాప్రతినిధులు, ప్రముఖుల మెప్పు పొందడానికి కొంతమంది అధికారులు చేసే అత్యుత్సాహం వివాదాస్పదమౌతుంటాయి. తాము కూడా తక్కువేం తినలేదంటూ..విలాసాలు, ఆడంబరాలకు పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చు చేస్తుంటారు. వీటిని సమకూర్చాలంటే..అధికారులకు చుక్కలు కనిపిస్తుంటాయి. తాజాగా..గవర్నర్ జలపాత అందాలను వీక్షించేందుకు ఏకంగా రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడం హాట్ టాపిక్ అయ్యింది. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీయడంతో…గవర్నర్ చిక్కుల్లో పడ్డారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Ind Vs Nz : అక్షర్ మాయ… 296 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్

నవంబర్ 25వ తేదీన కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ శివమొగ్గ జిల్లాలో పర్యటించారు. గెహ్లాట్ నగరంలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం జోగ్ ఫాల్స్ కు వెళ్లి..అక్కడ సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ లో బస చేశారు. గురువారం ఉదయం జోగ్ జలపాతాన్ని సందర్శించారు. దాదాపు 830 అడుగులకు పైగా ఎత్తునుంచి జలపాతాన్ని వీక్షించారు. కొద్దిసేపు ఉన్న అనంతరం గవర్నర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే…ఉదయం 6 గంటల ప్రాంతంలో లింగనమక్కి డ్యాం నుంచి దాదాపు 200 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జలపాతం వద్దకు చేరేందుకు దాదాపు మూడు గంటల సమయం పడుతుందని అంచనా. జలపాతానికి కాస్తా..జలకళను తీసుకొచ్చిపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Read More : Omicron Name : కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్‌’ పేరు వెనుక..చైనా అధ్యక్షుడు పేరులో ‘ Xi ’కథాకమామీషు..

కొన్ని నిమిషాల పాటు ఆహ్లాదకరంగా ఉన్న గవర్నర్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయిన వెళ్లిపోయిన అనంతరం నీటి విడుదలను ఆపేశారు. కానీ..రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసే సమయంలో..కింద ఉన్న గ్రామాల వాసులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. కానీ..అలా ఏమీ చెప్పకుండానే నీటిని విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నీటి విడుదల తెలుసుకున్న గ్రామస్థులు అలర్ట్ అయ్యారు. శరావతి నది దిగువన ఉన్న నివాసితులకు సమాచారం ఇవ్వకుండానే..నీటిని విడుదల చేయాలని సీనియర్ కేపీసీఎల్ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించేందుకు శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ లింగనమక్కి నిరాకరించినట్లు తెలుస్తోంది. విడుదల చేసిన నీటితో దాదాపు 2 వేల యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేయొచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.