Drugs Seized : కేరళ, జమ్మూకాశ్మీర్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

ఆఫ్ఘానిస్తాన్ నుంచి కేరళ తీరం ద్వారా శ్రీలంకకు డ్రగ్స్ తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మొత్తం మూడు పడవల్లో డ్రగ్స్ తరలిస్తుండగా రెండు పడవలు తప్పించుకున్నాయి.

Drugs Seized : కేరళ, జమ్మూకాశ్మీర్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

drugs seized

Officials seized Massive Drugs : కేరళ, జమ్మూకశ్మీర్ లలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కేరళ తీరంలో భారీగా డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. అరేబియా సముద్రంలో ఇండియన్ ఆర్మీ, ఎన్ సీబీ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో డ్రగ్స్ ను పట్టుకున్నారు. భారత సముద్ర జలాల్లో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి 134 సంచుల్లో 2,500 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ సరఫరా చేస్తున్న పాకిస్తాన్ కు చెందిన ఓ వ్యక్తిని నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 12 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ డ్రగ్స్ ను ఆఫ్ఘానిస్తాన్ నుంచి సముద్ర మార్గంలో తరలిస్తుండగా అధికారులు సీజ్ చేశారు.

Drugs Gang Arrest : భారీగా డ్రగ్స్ పట్టివేత.. విదేశాల నుండి కొకైన్ తెచ్చి విక్రయిస్తున్న ముఠా అరెస్టు

మ్యాకమ్ తీరం నుంచి 134 బస్తాల్లో మెథామ్ సేతుమిన్నుకు మోసుకెళ్తున్న మథర్ షిప్ కదికలపై నేవీ ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది. ఆఫ్ఘానిస్తాన్ నుంచి డ్రగ్స్ తో బయలుదేరిన భారీ ఓడ ఒకటి మాక్రం తీరం వెంబడి పాక్, ఇరాన్ మీదుగా చిన్న పడవల్లోకి డ్రగ్స్ ను పంపిణీ చేసుకుంటూ వస్తోందని సమాచారం ఇచ్చారు.

దీంతో అలర్ట్ అయిన అధికారులు గాలింపు చేపట్టారు. ఆఫ్ఘానిస్తాన్ నుంచి కేరళ తీరం ద్వారా శ్రీలంకకు డ్రగ్స్ తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మొత్తం మూడు పడవల్లో డ్రగ్స్ తరలిస్తుండగా రెండు పడవలు తప్పించుకున్నాయి.

Drugs : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మహిళ నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం.. విలువ రూ.41కోట్లు

మరోవైపు జమ్మూకాశ్మీర్ లోనూ డ్రగ్స్ పట్టుబడింది. కుప్వారా పరిధిలో నలుగురు స్మగ్లర్లను ఆర్మీ అరెస్టు చేసింది. వారి నుంచి 8 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకుంది. దీని విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.