Ola Electric పంట పండింది.. మ‌రో 200 మిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబడులు

ఓలా ఎల‌క్ట్రిక్ లోకి నిధులు వెల్లువెత్తాయి. తాజాగా 200 మిలియ‌న్ల డాల‌ర్ల‌కు పైగా నిధులు ఓలా ఎలక్ట్రిక్ సేక‌రించింది. ఫాల్క‌న్ ఎడ్జ్‌తోపాటు సాఫ్ట్ బ్యాంక్ త‌దిత‌ర ఇన్వెస్ట‌ర్ల నుంచి

Ola Electric పంట పండింది.. మ‌రో 200 మిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబడులు

Ola Electric

Ola Electric : ఓలా ఎల‌క్ట్రిక్ లోకి నిధులు వెల్లువెత్తాయి. తాజాగా 200 మిలియ‌న్ల డాల‌ర్ల‌కు పైగా నిధులు ఓలా ఎలక్ట్రిక్ సేక‌రించింది. ఫాల్క‌న్ ఎడ్జ్‌తోపాటు సాఫ్ట్ బ్యాంక్ త‌దిత‌ర ఇన్వెస్ట‌ర్ల నుంచి సేక‌రించిన పెట్టుబ‌డుల మొత్తం 300 కోట్ల‌కు చేరుకుందని క్యాబ్ అగ్రిగేట‌ర్ ఓలా అనుబంధ ఓలా ఎల‌క్ట్రిక్ తెలిపింది.

దక్షిణాసియా మార్కెట్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలని ఓలా చూస్తుంది. ఇటీవల నిధుల సమీకరణ కోసం చేపట్టిన కొత్త ఫైనాన్సింగ్ రౌండ్‌లో 200 మిలియన్ డాలర్ల నిధులను సేకరించినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది.

Pension : పెన్షన్లరకు అలర్ట్.. వెంటనే ఆ సర్టిఫికెట్ సబ్మిట్ చేయండి.. లేదంటే పెన్షన్ రాదు

భార‌త్‌లో ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లను విక్ర‌యించ‌డ‌మే ల‌క్ష్యంగా మిష‌న్ ఎల‌క్ట్రిక్‌ను బ‌లోపేతం చేయ‌డానికి తాము నిధులు స‌మ‌కూర్చుకుంటున్న‌ట్లు తెలిపింది. 2025 త‌ర్వాత ఇత‌ర వెహిక‌ల్ ప్లాట్‌ఫామ్స్‌లో అభివృద్ధిపై కేంద్రీక‌రిస్తామ‌ంది. ఎల‌క్ట్రిక్ మోటారు సైకిళ్లు, మాస్ మార్కెట్ స్కూట‌ర్లు, ఎల‌క్ట్రిక్ కార్ల‌ను త‌యారు చేయ‌డంపై ఫోక‌స్ చేస్తామ‌ంది.

ఇప్ప‌టికే ఓలాలో పెట్టుబ‌డులు పెట్టిన ఇన్వెస్ట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు.. కొత్త ఇన్వెస్ట‌ర్ల‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నాం. స‌మీప భ‌విష్య‌త్‌లో 100 కోట్ల వాహ‌నాల‌ను అందుబాటులోకి తేవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాం అంటూ ఓలా సీఈవో భ‌వీష్ అగ‌ర్వాల్ తెలిపారు. ఆగ‌స్టు 15న ఆవిష్క‌రించిన ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు ఎస్‌1, ఎస్ 1 ప్రో మోడ‌ళ్ల విక్ర‌యింతో 150 మిలియ‌న్ల డాల‌ర్లు సంపాదించింది.

ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ చేశాక ఫండ్ రైజ్ చేయడం ఇది తొలిసారి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1ను ఫుల్ చార్జ్ చేస్తే 121 కిలోమీటర్లు (75 మైళ్లు) ప్రయాణించొచ్చు. పెట్రోల్ వాహనాలను నడుపుతున్న ప్రతి ఒక్కరూ 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని ఓలా సీఈఓ అగర్వాల్‌ కోరారు. ఓలా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు ఐపీఓ వస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఐపీఓ విలువ 1.5 బిలియన్ డాలర్ల నుంచి 2 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

Grifthorse : 10 కోట్లకు పైగా ఆండ్రాయిడ్‌ యూజర్లకు ముప్పు.. ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి

భారత మార్కెట్ లో ఎలక్ట్రిక్​ వాహనాల హవా మొదలైంది. ప్రభుత్వాలు కూడా ఈ-వెహికిల్స్​పై సబ్సిడీలు ఇస్తుండటంతో వీటికి మంచి డిమాండ్​ ఏర్పడింది. ఈ మార్కెట్​ను క్యాష్ చేసుకోవడంలో క్యాబ్​ సర్వీసుల సంస్థ ఓలా ఇతర సంస్థల కంటే ముందుంది. ఓలా ఇటీవలే ఎలక్ట్రిక్​ వాహన రంగంలోకి అడుగుపెట్టి.. తన తొలి ఈ-వెహికిల్​ను లాంచ్​ చేసింది.