Elon Musk vs Bhavish: ఎల‌న్ మ‌స్క్ కు అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చిన ఓలా సీఈవో

టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్ పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. ట్విట‌ర్ ను కొనుగోలు చేసేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌వ్వ‌డంతో పాటు ట్విట‌ర్ వేదిక‌గా త‌న వ్య‌తిరేకుల‌పై పంచ్‌ల వ‌ర్షం కురిపిస్తుంటాడు. వ్యంగ్యంగా మాట్లాడుతూ అవ‌త‌లి వ్య‌క్తుల‌ను చిన్న‌బుచ్చుకొనేలా చేయ‌డంలో ఎల‌న్ మ‌స్క్ దిట్ట‌. తాజాగా ఎల‌న్ మ‌స్క్ ను భార‌త్ లో టెస్లా కార్ల త‌యారీ కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటూ...

Elon Musk vs Bhavish: ఎల‌న్ మ‌స్క్ కు అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చిన ఓలా సీఈవో

Musk

Elon Musk vs Bhavish: టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్ పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. ట్విట‌ర్ ను కొనుగోలు చేసేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌వ్వ‌డంతో పాటు ట్విట‌ర్ వేదిక‌గా త‌న వ్య‌తిరేకుల‌పై పంచ్‌ల వ‌ర్షం కురిపిస్తుంటాడు. వ్యంగ్యంగా మాట్లాడుతూ అవ‌త‌లి వ్య‌క్తుల‌ను చిన్న‌బుచ్చుకొనేలా చేయ‌డంలో ఎల‌న్ మ‌స్క్ దిట్ట‌. తాజాగా ఎల‌న్ మ‌స్క్ ను భార‌త్ లో టెస్లా కార్ల త‌యారీ కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటూ ఓ నెటిజన్ ప్ర‌శ్నించారు. దీనికి స్పందించిన మ‌స్క్.. ఇండియాకు రామని, ఇక్కడి మార్కెట్‌పై తమకు ఆసక్తి లేదన్నట్టుగా మాట్లాడారు. మస్క్‌ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మ‌స్క్ వ్యాఖ్య‌ల‌పై ఓలా ఎల‌క్ట్రిక‌ల్ స్కూట‌ర్ సీఈవో భ‌వీష్ అగ‌ర్వాల్ స్పందించారు. రీట్వీట్ చేస్తూ మ‌స్క్ కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. నువ్వు ఇండియాకు వ‌స్తే ఏంటీ? రాకుంటే ఏంటీ అన్న‌ట్లు అర్థం వ‌చ్చేలా భవీష్ త‌న‌దైన శైలిలో థ్యాంక్స్‌.. బ‌ట్ నో థ్యాంక్స్ అంటూ ప‌క్క‌నే ఇండియా ప్లాగ్ పెడుతూ ట్వీట్ చేశాడు. ఇప్ప‌టికే ఇండియాలో ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాల ను ప్రోత్స‌హించేందుకు కేంద్రం చ‌ర్య‌లు చేప‌డుతుంది. ఈ క్ర‌మంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు కొనుగోలు చేసేవారికి రాయితీలు సైతం క‌ల్పిస్తుంది. అనేక కంపెనీలు ఇండియాలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీపై ఫోక‌స్ పెట్టాయి. ఓలా కూడా ఇప్ప‌టికే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల విక్ర‌యాల్లో వేగం పెంచింది. త్వ‌ర‌లో ఇదే కంపెనీ నుంచి కార్లు సైతం రానున్నాయి.

ప్ర‌పంచంలోనే రెండ‌వ పెద్ద మార్కెట్ కు కేంద్రంగా ఉన్న భార‌తదేశంలో టెస్లా కార్లు విక్ర‌యానికి ఆ కంపెనీ సిద్ధ‌మైంది. కేంద్ర ప్ర‌భుత్వం సైతం అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికీ.. భార‌త్ లోనే కార్ల త‌యారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని ష‌ర‌తు పెట్టింది. చైనాలో త‌యారు చేసి ఇక్క‌డికి కార్ల‌ను తెస్తామంటే క‌ల‌వ‌ద‌ని తేల్చి చెప్పింది. టెస్లా కంపెనీ ప్ర‌తినిధులు అందుకు ఒప్ప‌కోలేదు. తాజాగా ఓ నెటిజ‌న్.. ఇండియాలో టెస్లా కార్ల‌ త‌యారీ కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటూ టెస్లా కంపెనీ సీఈవో ఎల‌న్ మ‌స్క్ ను ప్ర‌శ్నించాడు. దీనికి ప్ర‌తిగా టెస్లా సీఈవో మ‌స్క్ వ్య‌గ్యంగా స‌మాధానం ఇచ్చాడు. దీంతో ఓలా సీఈవో భ‌వీష్ అగ‌ర్వాల్ మ‌స్క్ కు రీ ట్వీట్ చేశాడు.. థ్యాక్స్‌.. బ‌ట్ నో థ్యాక్స్ అంటూ మ‌స్క్ కు గ‌ట్టిగా త‌గిలేలా వ్య‌గ్యంగా కౌంట‌ర్ ఇచ్చాడు. దీంతో అగ‌ర్వాల్ ట్వీట్ కు నెటిజన్లు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడే మ‌స్క్ కు ఇలాంటి కౌంట‌రే ఇవ్వాలంటూ అగ‌ర్వాల్ కు మ‌ద్ద‌తుగా నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.