Ola – Oxygen Concentrator: మీ ఇంటికే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఫ్రీ డెలివరీ

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పెరుగుతున్న దృష్ట్యా హెల్త్ కేర్ సిస్టమ్‌పై కేసుల తీవ్రత ఎక్కువైపోయింది. కేస్ లోడ్ పెరుగుతుండటంతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సట్రేటర్లు, హాస్పిటల్ బెడ్స్ కొరత ఏర్పడింది.

Ola – Oxygen Concentrator: మీ ఇంటికే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఫ్రీ డెలివరీ

Ola

Ola – Oxygen Concentrator: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పెరుగుతున్న దృష్ట్యా హెల్త్ కేర్ సిస్టమ్‌పై కేసుల తీవ్రత ఎక్కువైపోయింది. కేస్ లోడ్ పెరుగుతుండటంతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సట్రేటర్లు, హాస్పిటల్ బెడ్స్ కొరత ఏర్పడింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మెడిసిన్ కొరత కూడా కనిపిస్తుంది.

ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలకు ఆక్సిజన్ కాన్సట్రేటర్ అందించేందుకు ఓలా మంచి నిర్ణయమే తీసుకుంది. సదరు కంపెనీ డొనేషన్ ప్లాట్ ఫాం అయినటువంటి GiveIndiaతో పార్టనర్ అయి 10వేల ఆక్సిజన్ కాన్సట్రేటర్లను హోం డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. అది కూడా ఉచితంగానే.

అదే విషయాన్ని ట్వీట్లో అనౌన్స్ చేశారు ఓలా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవీశ్ అగర్వాల్.. ‘మన కమ్యూనిటీలను కాపాడుకునేందుకు అంతా కలిసికట్టుగా ఉండాలి. ఇవాళ ఇండియా కోసం అవసరమున్న వారికి ఆక్సిజన్ ను ఉచితంగా అందిస్తాం’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు.

కాన్సట్రేటర్లు డెలివరీ చేయడంతో పాటు.. పర్సన్స్ దగ్గర్నుంచి అవే మెషీన్లను అవసరం అయిపోయాక తిరిగి కలెక్ట్ చేసుకుంటుంది కూడా. ‘ఓలా యాప్ లో ఆక్సిజన్ కాన్సట్రేటర్ల కోసం రిక్వెస్ట్ చేయొచ్చు. ఒకసారి వాలిడేట్ అయితే ఇంటి వద్దకే డెలివరీ, పికప్ చేస్తాం’ అని భవీశ్ అగర్వాల్ అన్నారు.

గడిచిన 24గంటల్లో ఇండియాలో 3.29లక్షల తాజా కేసులు నమోదయ్యాయి. దీంతో కేస్ లోడ్ 2.29కోట్లకు పెరిగింది. మృతుల సంఖ్య 2లక్షల 49వేల 992కు చేరింది. గడిచిన 24గంటల్లో 3వేల 876మంది ఇన్ఫెక్షన్ తో మరణించారు.