Old Five Rupee Note: లక్షలు పలుకుతున్న పాత రూ.5 నోటు.. ప్రచారం అంతా అబద్దమే!

ఎవరెన్ని చెప్పినా డబ్బు మీద ఉన్న ఆశ మనిషిని కుదురుగా ఉండనివ్వడం లేదు. మనిషి డబ్బు ఆశనే కొందరు పెట్టుబడిగా మోసాలకు పాల్పడి బ్రతకడమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి వారి ఆగడాలు ఎన్నిసార్లు వెలుగులోకి వచ్చినా మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉన్నారు. అలాంటి మోసమే ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

Old Five Rupee Note: లక్షలు పలుకుతున్న పాత రూ.5 నోటు.. ప్రచారం అంతా అబద్దమే!

Old Five Rupee Note

Old Five Rupee Note: ఎవరెన్ని చెప్పినా డబ్బు మీద ఉన్న ఆశ మనిషిని కుదురుగా ఉండనివ్వడం లేదు. మనిషి డబ్బు ఆశనే కొందరు పెట్టుబడిగా మోసాలకు పాల్పడి బ్రతకడమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి వారి ఆగడాలు ఎన్నిసార్లు వెలుగులోకి వచ్చినా మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉన్నారు. అలాంటి మోసమే ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మీ వద్ద పాత నోట్లు, పాత కరెన్సీ కాయిన్స్ ఉంటే మీరే లక్షాధికారులు కావచ్చు. మీ పాత నోటు మాకిస్తే మీకు లక్షల రూపాయల చెల్లిస్తామని కొందరు మాయగాళ్లు ఇప్పుడు ఒక సరికొత్త మోసాలకు తెరతీశారు.

అలాంటి మోసాన్ని నమ్మిన కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మోసగాళ్లకు లక్షలు సమర్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కామారెడ్డి జిల్లాలోని చిన్న మ‌ల్లారెడ్డి గ్రామానికి చెందిన క‌స్తూరి న‌ర్సింలుకు ఒక వ్యక్తి ఏప్రిల్ 1న పోన్ చేసి మీ వ‌ద్ద ట్రాక్టర్ బొమ్మ ఉన్న పాత 5 రూపాయల నోటు ఉంటే రూ.11.74 లక్షలు ఇస్తామని చెప్పాడు. తన వద్ద పాత ఐదు రూపాయల నోటు ఉందని వీళ్ళకి ఎలా తెలుసని అనుకుంటూనే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది కదా నాకెందుకు అని నోటు మీకు ఎలా ఇవ్వాలి.. డబ్బు నాకు ఎలా ఇస్తారని బేరం మొదలుపెట్టాడు.

ముందుగా తీయని మాటలు చెప్పిన మోసగాళ్లు తాము చెప్పినట్లు చేస్తేనే మీకు డ‌బ్బులు వ‌స్తాయ‌ని న‌మ్మబ‌లికారు. ముందుగా అకౌంట్ నంబ‌ర్, ఆధార్ కార్డును వాట్సాప్ ద్వారా పంపమని చెప్పిన వాళ్ళు రెండు రోజుల తర్వాత నీకు డబ్బులు పంపాలంటే ఎన్ఓసి, ఐటీ క్లియరెన్స్ చేయాలనీ అందుకు ఖర్చు అవుతుందని నర్సింలుతో చెప్పారు. మీకు ఇస్తామన్న డబ్బుతో పాటు ఇప్పుడు మీరు పెట్టే ఖర్చు కూడా కలిపి వస్తుందని చెప్పడంతో విడతల వారీగా వాళ్ళు అడిగినప్పుడల్లా మొత్తం రూ.8.35 లక్షల రూపాయలు అకౌంట్ లో జమ చేశాడు.

తేరగా డబ్బులు పంపిస్తుంటే అవతలి వాళ్ళు ఎందుకు కాదనుకుంటారు.. అసలే స్కెచ్ వేసిందే దోచుకోవడానికి కదా. మళ్ళీ మళ్ళీ డబ్బు పంపాలని ఫోన్లు చేస్తుండడంతో మోసపోయానని గ్రహించిన నర్సింలు జరిగిన తతంగాన్ని, ఆశపడి తాను చేసిన ఘనకార్యాన్ని పోలీసుల వద్ద వాపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ నెంబర్, వాట్సాప్, బ్యాంక్ ఖాతాల ఆధారంగా మోసగాళ్లు పశ్చిమ బెంగాల్ నుండి కథ నడిపినట్లుగా గుర్తించారు. కేసును విచారిస్తున్న పోలీసులు ఇలాంటి ప్రచారాలు నమ్మి మోసపోవద్దని మరోసారి ప్రజలను కోరుతున్నారు.