Wrestlers Protest: మేరీకోమ్‌కే బాధ్యతలు.. రెజ్లర్ల‌పై వేధింపుల ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు కమిటీని నియమించిన కేంద్రం

కేంద్ర క్రీడాశాఖ మంత్రి హామీ మేరకు మహిళా రెజ్లర్ల పై వేధింపుల ఆరోపణల విషయాన్ని నిగ్గు తేల్చేందుకు కేంద్రం పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రముఖ బాక్సర్, రాజ్యసభ మాజీ సభ్యురాలు మేరీకోమ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది.

Wrestlers Protest: మేరీకోమ్‌కే బాధ్యతలు.. రెజ్లర్ల‌పై వేధింపుల ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు కమిటీని నియమించిన కేంద్రం

Mary Kom

Wrestlers Protest: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ మహిళ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ మహిళా రెజ్లర్లు నిరసనకు దిగిన విషయం విధితమే. మూడు రోజుల పాటు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దాదాపు 30 మంది రెజ్లర్లు నిరసనకు దిగారు. బ్రిజ్ భూషణ్ ను వెంటనే సమాఖ్య అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ పలు సార్లు రెజ్లర్లతో చర్చలు జరిపారు. శనివారం మరోసారి రెజ్లర్లతో జరిగిన చర్చల్లో బ్రిజ్ భూషణ్ పై చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు, అవినీతి అక్రమాల ఆరోపణలపై విచారణ కమిటీ వేస్తామని, నెల రోజుల్లో నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. దీంతో రెజ్లర్లు నిరసన విరమించారు.

Wrestlers Protest: రెజ్లర్ల నిరసన ఎఫెక్ట్.. అయోధ్యలో జరగాల్సిన డబ్ల్యూఎఫ్‌ఐ సమావేశం రద్దు.. సహాయ కార్యదర్శి సస్పెన్షన్

కేంద్ర క్రీడాశాఖ మంత్రి హామీ మేరకు మహిళా రెజ్లర్ల పై వేధింపుల ఆరోపణల విషయాన్ని నిగ్గు తేల్చేందుకు కేంద్రం పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రముఖ బాక్సర్, రాజ్యసభ మాజీ సభ్యురాలు మేరీకోమ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. నెల రోజుల పాటు డబ్ల్యూఎఫ్ఐ రోజువారీ వ్యవహారాలను ఈ కమిటీ చూసుకుంటుంది. ఇదిలాఉంటే మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఏడుగురు సభ్యులతో ఇదివరకే కమిటీని నియమించింది. ఇందులో మేరీకోమ్ కూడా ఉన్నారు.

Wrestlers Protest: తాత్కాలికంగా నిరసన విరమించిన రెజ్లర్లు.. కేంద్ర క్రీడా మంత్రితో చర్చలు అనంతరం నిర్ణయం ..

బ్రిజ్ భూషణ్‌పై వేధింపుల ఆరోపణలు రావడంతో కేంద్రం డబ్ల్యూఎఫ్ఐ రోజువారీ కార్యకలాపాలకు నెలరోజుల పాటు దూరంగా ఉండాలని ఆదేశించిన విషయం విధితమే. ఈ క్రమంలో డబ్ల్యూఎఫ్ఐ ఆదివారం అయోధ్యలో నిర్వహించ తలపెట్టిన అత్యవసర సర్వసభ్య మండలి సమావేశం రద్దయింది. ప్రస్తుతం కేంద్ర ఏర్పాటు చేసిన కమిటీ నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఇప్పటికే కేంద్ర క్రీడా శాఖ మంత్రి స్పష్టం చేశారు.