Corona Virus: సెకండ్ వేవ్‍కి కారణమైన డెల్టా కంటే 6 రెట్లు వేగంగా ఓమిక్రాన్ వ్యాప్తి.. వ్యాక్సిన్ కూడా పనిచేయట్లేదు

కరోనా వైరస్‌ లేటెస్ట్ వేరియంట్ ఓమిక్రాన్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Corona Virus: సెకండ్ వేవ్‍కి కారణమైన డెల్టా కంటే 6 రెట్లు వేగంగా ఓమిక్రాన్ వ్యాప్తి.. వ్యాక్సిన్ కూడా పనిచేయట్లేదు

Omicran

Corona Virus: కరోనా వైరస్‌ లేటెస్ట్ వేరియంట్ బి.1.1.529(ఓమిక్రాన్) గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అత్యంతా వేగంగా విస్తరిస్తున్న ఈ వేరియంట్ కరోనా మూడో వేవ్‌కు మన దేశంలో కారణం అవుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్‌ వేగాన్ని శాస్త్రవేత్తలు లేటెస్ట్‌గా అంచనా వేశారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌కి కారణమైన డెల్టా వేరియంట్ కంటే ఈ వేరియంట్ ఆరు రెట్లు ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు.

కరోనా మహమ్మారి కట్టడికి ఇప్పటికే పలు దేశాలు ఆంక్షలు విధిస్తుండగా.. సరిహద్దులను కూడా ఇప్పటికే మూసివేస్తున్నాయి. కొత్త వేరియంట్‌ ఉద్ధృతి నేపథ్యంలో పలు రాష్ర్టాలకు కేంద్రం మార్గదర్శకాలు వి చేసింది. వైరస్‌ భయాలతో పలు రాష్ర్టాలు కూడా కఠిన ఆంక్షలను విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తుంది కేంద్రం.

అయితే, ఓమిక్రాన్ విషయంలో మరో ఆందోళనకర అంశం ఏమిటంటే వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కూడా ఓమిక్రాన్ వేగంగా వ్యాపించడమే. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా కూడా పలు దేశాల్లో ఓమిక్రాన్ వ్యాప్తి మాములుగా ఉందని చెబుతున్నారు. ‘ఒమిక్రాన్‌’ వ్యాప్తి ప్రస్తుతం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్‌, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌, బోట్స్‌వానా, బెల్జియం, చెక్‌రిపబ్లిక్‌, బవేరియా, ఆస్ట్రియా, బ్రిటన్‌ దేశాల్లో ఎక్కువగా ఉంది.

Walkers OU : ఓయూలో వాకర్లకు రూ. 200 యూజర్ ఛార్జీలు, ఎందుకో తెలుసా ?