Omicron: మూడో వేవ్ రాకుండా ఒమిక్రాన్‌పై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్!

ఒమిక్రాన్ రూపంలో కరోనా కష్టపెడుతూ ఉండగా.. ఒమిక్రాన్ కట్టడి చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది.

Omicron: మూడో వేవ్ రాకుండా ఒమిక్రాన్‌పై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్!

Corona Lockdown

Omicron: కరోనా మూడో వేవ్ రాకను కంట్రోల్ చెయ్యడానికి కేంద్రం సిద్ధమైంది. ఒమిక్రాన్ రూపంలో కరోనా కష్టపెడుతూ ఉండగా.. ఒమిక్రాన్ కట్టడి చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతంగా పెరిగిపోతున్న క్రమంలో కరోనా కట్టడి కోసం జాగ్రత్తలు పాటించాలని, ప్రజలు మాస్క్‌లు వేసుకునేలా చూడాలని రాష్ట్రాలకు సూచించింది.

కరోనా కేసుల పెరిగితే, కంట్రోల్ చెయ్యడం కష్టం అవుతుందని, మూడో వేవ్ వచ్చేస్తుందని, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది కేంద్రం. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పాజిటివిటీ రేటును కంట్రోల్ చెయ్యాలని, ఎక్కువ కేసులున్న క్లస్టర్లను పర్యవేక్షించాలని కేంద్రం సూచిస్తోంది.

రాబోయే పండుగల సీజన్‌‌లో ఆంక్షలు, పరిమితులను కఠినంగా అమలు చెయ్యాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. రాత్రిపూట కర్ఫ్యూలు విధించే విషయంలో ఏ మాత్రం తగ్గొద్దని, ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో కఠినమైన నియంత్రణ ఉండేలా.. అవసరమైతే 144సెక్షన్ అమలు చెయ్యాలని కోరింది.

కోవిడ్ క్లస్టర్‌లలో కంటైన్‌మెంట్ జోన్‌లు, బఫర్ జోన్‌లకు ఏర్పాటు చేసేలా చూసుకోవాలని స్పష్టంచేసింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించి, అర్హులైన లబ్ధిదారులందరికి వ్యాక్సినేషన్ రెండు డోసులను వేగంగా అందించాలని కోరింది. వ్యాక్సిన్ కవరేజీ జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇంటింటికీ వ్యాక్సినేషన్ ప్రచారాన్ని వేగవంతం చెయ్యాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.