Omicron Unstoppable : ప్రతి ఒక్కరు ఒమిక్రాన్ బారిన పడతారు, బూస్టర్ డోసు ఆపలేదు- టాప్ మెడికల్ ఎక్స్‌పర్ట్

ప్రతి ఒక్కరూ ఒమిక్రాన్ బారిన పడతారు. అంతేకాదు బూస్టర్ డోసులు ఒమిక్రాన్ ను అడ్డుకోలేవని తేల్చి చెప్పారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఒమిక్రాన్ వేరియంట్.. అల్మోస్ట్ అన్ స్టాపబుల్..

Omicron Unstoppable : ప్రతి ఒక్కరు ఒమిక్రాన్ బారిన పడతారు, బూస్టర్ డోసు ఆపలేదు- టాప్ మెడికల్ ఎక్స్‌పర్ట్

Omicron Unstoppable

Omicron Unstoppable : యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి దేశ టాప్ మెడికల్ ఎక్స్ పర్ట్ షాకింగ్ విషయాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒమిక్రాన్ బారిన పడతారని ఆయన అన్నారు. అంతేకాదు బూస్టర్ డోసులు ఒమిక్రాన్ ను అడ్డుకోలేవని తేల్చి చెప్పారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఒమిక్రాన్ వేరియంట్.. అల్మోస్ట్ అన్ స్టాపబుల్ అని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య గురించి చెబుతున్న లెక్కలు నిజానికి దగ్గరగా లేవన్న ఆయన.. బాధితుల సంఖ్య 90 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని చెప్పారు.

Work From Home: కొత్త ఆంక్షలు.. ఆఫీసులు మూసివేత.. మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్‌!

కోవిడ్ ఇక ఎంతమాత్రమూ భయపెట్టే వ్యాధి కాదని ఆయన నొక్కి చెప్పారు. ”ఎందుకంటే కరోనా కొత్త వేరియంట్ చాలా తేలికపాటిది, తక్కువ మంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఇది మనం ఎదుర్కోగల వ్యాధి. చాలా భిన్నమైన వైరస్‌తో వ్యవహరిస్తున్నాము. ఇది డెల్టా కంటే చాలా తేలికైనది. ఈ విషయం అందరికీ తెలుసు. అయిదే, ఇది ఆచరణాత్మకంగా ఆపలేనిది. ఒమిక్రాన్ ఓ జలుబు లాంటిది” అని మెడికల్ టాప్ ఎక్స్ పర్ట్ చెప్పారు.

TATA IPL: వీవో ఐపీఎల్ బదులు టాటా ఐపీఎల్‌గా పేరు మార్పు

“మనలో మెజారిటీ మందికి ఒమిక్రాన్ సోకినట్లు కూడా తెలియదు. బహుశా 80శాతం కంటే ఎక్కువ మందికి ఒమిక్రాన్ బారిన ఎప్పుడు పడ్డాము అన్నది కూడా తెలియదు” అని ఎపిడెమియాలజిస్ట్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ జైప్రకాష్ ములియిల్ అన్నారు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి.. తగ్గిందని ఊపిరిపీల్చుకునే లోపే.. కొత్త రూపాల్లో విజృంభిస్తోంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరిపైనా విరుచుకుపడుతోంది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రపంచమంతా ప్రళయం సృష్టిస్తోంది. మొదటి దశలో కాస్త ఎక్కవగా భయాన్ని కలిగించినప్పటికీ.. ప్రాణ నష్టం కలిగించ లేదు. కానీ.. సెకండ్ వేవ్ లో విశ్వరూపం దాల్చింది. అనేక మంది ప్రాణాలు తీసుకుంది. ఇప్పుడు మూడో దశలో ఒమిక్రాన్ రూపంలో ప్రళయాన్ని సృష్టించేందుకు కరోనా సిద్ధమైంది.

ప్రపంచదేశాలను ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్‌ కలవరపెడుతోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన.. బీ 1.1.529 ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ.. కునుకు లేకుండా చేస్తోంది. బీ.1.1.529ను ఆందోళనకర వేరియెంట్‌గా గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ కొత్త వేరియెంట్‌కు ‘ఒమిక్రాన్’ అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. 32 మ్యుటేషన్లు ఉన్న ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగి ఉంది.