Omicron In Goa : గోవాలో ఒమిక్రాన్ కేసు నమోదు..యూకే నుంచి వచ్చిన 8 ఏళ్ల చిన్నారికి వేరియంట్

గోవాలో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. యూకే నుంచి వచ్చిన 8 ఏళ్ల చిన్నారికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారించారు. ఓమిక్రాన్ కేసుల్లో అగ్రస్థానంలో ఢిల్లీ ఉంది.

Omicron In Goa : గోవాలో ఒమిక్రాన్ కేసు నమోదు..యూకే నుంచి వచ్చిన 8 ఏళ్ల చిన్నారికి వేరియంట్

Goa

Omicron case registered in Goa : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ ను కూడా కలవర పెడుతోంది. దేశంలో రోజుకు రోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గోవాలో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. యూకే నుంచి వచ్చిన 8 ఏళ్ల చిన్నారికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 579కి చేరుకుంది. ఇప్పటివరకు 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

ఓమిక్రాన్ కేసుల్లో అగ్రస్థానంలో ఢిల్లీ ఉండగా, తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. ఢిల్లీలో 142, మహారాష్ట్రలో 141, కేరళలో 57, గుజరాత్‌లో 49, రాజస్థాన్ 43, తెలంగాణలో 41, తమిళనాడు 34, కర్ణాటకలో 31, గోవాలో 1 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒమిక్రాన్ నుంచి 151 మంది కోలుకున్నారు.

Somu Veerraju : బీజేపీ అధికారంలోకి వస్తే రూ.75లకే చీప్ లిక్కర్ : సోము వీర్రాజు

ప్రస్తుతం దేశంలో డెల్టా వేరియంట్‌ కేసులే ఎక్కువగా ఉన్నప్పటికీ… ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు వేరియంట్ కట్టడిపై ఫోకస్ పెట్టాయి.

ప్రపంచదేశాలను ఒమిక్రాన్‌ వణికిస్తోంది. 108 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఇప్పటివరకు సుమారు లక్షన్నర మందికి ఈ వేరియంట్ సోకినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్క యూకేలోనే 90 వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. డెన్మార్క్‌లో మరో 30 వేలమందికిపైగా ఒమిక్రాన్ బారినపడ్డారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌తో 27మంది మృతి చెందారు.