Omicron In India : భారత్ లో 23కు చేరిన ఒమిక్రాన్ కేసులు..ముంబైలో మరో ఇద్దరికి సోకిన వైరస్

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ ను కలవర పెడుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23 కు చేరింది.

Omicron In India : భారత్ లో 23కు చేరిన ఒమిక్రాన్ కేసులు..ముంబైలో మరో ఇద్దరికి సోకిన వైరస్

India

Omicron cases in India : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ ను కలవర పెడుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23 కు చేరింది. తాజాగా మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు కొత్త వేరియంట్ కేసులను ముంబైలో గుర్తించారు. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది.

ఆదివారం నమోదైన 17 ఒమిక్రాన్ కేసుల్లో రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో 9, మహారాష్ట్రలోని పూణేలో 7, ఢిల్లీలో ఒకటి చొప్పున నమోదయ్యాయి. తాజాగా సోమవారం మహారాష్ట్రలోని ముంబైలో మరో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. రాజస్థాన్ లోని ఒకే కుటుంబంలో 9 మందికి ఒమిక్రాన్ గా నిర్ధారణ అయింది. నిన్న మహారాష్ట్రలోని పుణెలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ముంబైలో మరో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించారు.

CM Jagan : నాసి రకం విత్తనాలు, ఎరువులు అమ్మితే రెండేళ్లు జైలు శిక్ష..!

దేశంలో తొలుత కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. మొట్టమొదట దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్ ​ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. భారత్​లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో భారత్​లో కరోనా థర్డ్ వేవ్ భయాలు మొదలయ్యాయి. థర్డ్ వేవ్​ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్​ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దేశంలో ఈ రకం కరోనా కేసులు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.