Omicron Effect: ముందు జాగ్రత్త.. జనవరి 5వ తేదీ వరకు అమల్లోకి 144సెక్షన్!

కరోనా, న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకల వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కీలక నిర్ణయం తీసుకుంది.

Omicron Effect: ముందు జాగ్రత్త.. జనవరి 5వ తేదీ వరకు అమల్లోకి 144సెక్షన్!

Lucknow (1)

Omicron Effect: కరోనా, న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకల వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ముప్పు పెరుగుతున్న క్రమంలో యోగి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 144సెక్షన్‌ను అమల్లోకి తీసుకుని వచ్చింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చింది. జనవరి 5, 2022 వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటుంది.

జిమ్-హోటల్ 50శాతం సామర్థ్యంతో..
రెస్టారెంట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, జిమ్‌లు, స్టేడియంలను 50 శాతం సామర్థ్యంతో మాత్రమే తెరవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. నగరంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, ఏదైనా కార్యక్రమాలలో 100 మంది కంటే ఎక్కువ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది.

Omicron Third Wave : ఒమిక్రాన్ కారణంగా భారత్‌లో భారీ ఎత్తున థర్డ్ వేవ్ వచ్చే అవకాశం.. IMA వార్నింగ్

క్రిస్మస్, డిసెంబర్ 31, న్యూ ఇయర్ పార్టీల సమయంలో, కరోనా వైరస్ ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. పోలీసులు మాస్క్ ధరించడం, రెండు గజాల దూరం పాటించడం తప్పనిసరి చేసింది ప్రభుత్వం.

జనం గుమికూడే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంటుంది. సైబర్ క్రైమ్ సెల్ కూడా ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిశితంగా గమనిస్తుంది. ఆన్‌లైన్‌లో పుకార్లు వ్యాప్తి చేయడం, అభ్యంతరకర పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.