Omicron Fear : పెళ్లిళ్లకు 100 మందే.. సినిమా హాళ్లు, జిమ్‌లలో 50శాతం మించొద్దు.. మహారాష్ట్రలో కొత్త ఆంక్షలు

రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని చెప్పింది. ఇండోర్ లో జరిగే పెళ్లిళ్లకు 100, ఔట్ డోర్ లో జరిగే పెళ్లిళ్లకు 250 మంది కంటే..

Omicron Fear : పెళ్లిళ్లకు 100 మందే.. సినిమా హాళ్లు, జిమ్‌లలో 50శాతం మించొద్దు.. మహారాష్ట్రలో కొత్త ఆంక్షలు

Omicron Fear

Omicron Fear : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అందరిలోనూ మళ్లీ ఆందోళన మొదలైంది. ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది.

రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని చెప్పింది. అలాగే పెళ్లిళ్లకు హాజరయ్య జనంపై ఆంక్షలు పెట్టింది. ఇండోర్ లో జరిగే పెళ్లిళ్లకు 100, ఔట్ డోర్ లో జరిగే పెళ్లిళ్లకు 250 మంది కంటే ఎక్కువ మంది హాజరుకావొద్దని ఆదేశించింది. ఇక జిమ్స్, స్పా, థియేటర్లు 50శాతం కెపాసిటీతోనే నడిపించుకోవాలని తేల్చి చెప్పింది.

Bank Account KYC : బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి ఆ అకౌంట్లు పని చేయవు..

మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 100 దాటింది. ఇవాళ(డిసెంబర్ 24) ఒక్కరోజే అక్కడ 20 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 108కి పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికులకు వారం రోజుల క్వారంటైన్ విధించారు. ఇతర అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించకుండా ఆంక్షలు పెట్టారు. వారికి ప్రత్యేక వాహనాలు కేటాయించారు.

కరోనా వైరస్ మహమ్మారి.. క్రమంగా కనుమరుగైపోతుందనుకుంటున్న సమయంలో కొత్త రూపంలో విరుచుకుపడింది. “ఒమిక్రాన్” వేరియంట్ రూపంలో మళ్లీ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తొలుత సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్ గురించి ఇంకా పూర్తి సమాచారం లేదు.

Garlic : రోజూ వెల్లుల్లి తీసుకుంటే బరువు తగ్గవచ్చా?

కాగా, క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో కట్టడి చేసేందుకు ఆయా దేశాలు సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. దాదాపు 100 దేశాల్లో ఇప్పటికే ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు గత నాలుగైదు రోజుల నుంచి బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి కొన్ని దేశాల్లో రోజువారీ కోవిడ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం మరింత ఆందోళన కలిగించే విషయం. జనాభా తక్కువ ఉండే దేశాల్లోనే ప్రతి రోజూ లక్షల్లో కోవిడ్ కేసులు నమోదవుతుంటం ఆందోళనకర పరిణామం.

అటు కోవిడ్, ఇటు ఒమిక్రాన్.. ఎట్టిపరిస్థితుల్లో నిలువరించేందుకు భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా నిలువరించే దిశగా మోదీ సర్కార్ అన్ని చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హర్యానా సహా పలు రాష్ట్రాలు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించారు.