Omicron In India : ఇండియాలో ఒమిక్రాన్..మహారాష్ట్రలో కొత్తగా 85 కేసులు

లెటెస్ట్ గా మహారాష్ట్రలో కొత్తగా 85 ఒమిక్రాన్ కేసులు నమోదవడం తీవ్ర ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. రాజస్థాన్ లో 23 కేసులు...

Omicron In India : ఇండియాలో ఒమిక్రాన్..మహారాష్ట్రలో కొత్తగా 85 కేసులు

Omicron (1)

Omicron In India : దేశంలో కరోనా వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. పలు రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇతర దేశాలకు తీసిపోని విధంగా కేసులు రికార్డవుతున్నాయి. లెటెస్ట్ గా మహారాష్ట్రలో కొత్తగా 85 ఒమిక్రాన్ కేసులు నమోదవడం తీవ్ర ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. రాజస్థాన్ లో 23 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 69కి చేరాయి. గుజరాత్ లో 19 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ఒమిక్రాన్‌ మహారాష్ట్రకు తీసిపోని విధంగా నమోదవుతున్నాయి. అటు కరోనా కేసులు కూడా 50శాతం పెరుగుదల రికార్డవడం మరింత కలవర పెడుతోంది. పాజిటివిటి రేటు కూడా పెరగడంతో ఢిల్లీ సర్కార్‌ ఎల్లో అలెర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

Read More : Mohammed Fareeduddin : గుండెపోటుతో మాజీ మంత్రి కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం

ఇక న్యూఇయర్‌ వస్తుండడంతో ఢిల్లీ బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు ప్రయాణించే అవకాశం కనిపిస్తోంది.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. ఒమిక్రాన్‌ కట్టడికి కేరళ ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ విధించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నట్లు వెల్లడించింది. రేపటి నుంచి జనవరి 2 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నట్లు తెలిపింది. డిసెంబర్‌ 31న రాత్రి 10 దాటిన తర్వాత బయట ఎలాంటి సెలబ్రేషన్లు, గుంపులుగా చేరవద్దని పేర్కొంది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కూడా నైట్‌ కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ నిబంధన అమలవుతోంది.

Read More : Coronavirus France : ఫ్రాన్స్‌లో కరోనా కల్లోలం.. రికార్డు స్థాయిలో 2 లక్షలకు చేరిన కొత్త రోజువారీ కేసులు

ఇటు కర్ణాటక కూడా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. న్యూఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించింది. ఇటు ఉత్తరాఖండ్‌ కూడా నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది. మరోవైపు మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రలో ఇప్పటికే అక్కడి ప్రభుత్వాలు రాత్రి 11 నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ, ఇతర నిబంధనలు అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ దిశగానే పయనించనున్నట్లు తెలుస్తోంది. ఇటు తెలంగాణలో కూడా ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌ తర్వాత దేశంలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు తెలంగాణలోనే రికార్డవుతుండడం టెన్షన్‌ పెడుతోంది.