Maharashtra : గుడ్ న్యూస్, ఒమిక్రాన్‌‌తో కోలుకున్న చిన్నారి

మహారాష్ట్రలో ఇటీవలే ఏడాదిన్నర చిన్నారి ఒమిక్రాన్ బారిన పడడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడడంతో చిన్నారిని డిశ్చార్జ్ చేశారు...

Maharashtra : గుడ్ న్యూస్, ఒమిక్రాన్‌‌తో కోలుకున్న చిన్నారి

Omicron virus

Omicron Girl Recovers : కరోనా వైరస్ కనుమరుగు కాకముందే…కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశాన్ని భయపెడుతోంది. పలు రాష్ట్రాల్లో కేసులు వెలుగు చూస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే..ఈ వేరియంట్ సోకిన చిన్నారి ఆరోగ్యవంతురాలు కావడం…ఊరటనిచ్చే అంశం. మహారాష్ట్రలో ఇటీవలే ఏడాదిన్నర చిన్నారి ఒమిక్రాన్ బారిన పడడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆ రాష్ట్రంలోని తల్లిదండ్రులు భయపడిపోయారు. తాజాగా..నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో చిన్నారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Read More : Nagaland Rally : అమిత్ షాకు వ్యతిరేకంగా..నాగాలాండ్ లో భారీ నిరసన ర్యాలీ

నైజీరియా నుంచి భారత్ కు ఓ మహిళ వచ్చారు. పింప్రీ చించ్వాడ్ లోని తన సోదరుడి వద్దకు ఇద్దరు కుమార్తెలతో పాటు…వచ్చారు. అనంతరం వీరు అస్వస్థకు గురి కావడంతో…వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆ మహిళ…ఆమె సోదరుడు, ఇద్దరు కుమార్తెలకు ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇందులో ఏడాదిన్నర చిన్నారి ఉండడం అందర్నీ షాక్ కు గురి చేసింది. తాజాగా..చిన్నారితో పాటు..నలుగురికి నెగెటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు పింప్రీ – చించ్వాడ్ ప్రాంత ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. పొడి దగ్గు ఉన్న ఓ మహిళ తప్ప…మిగతా వారిలో ఎలాంటి లక్షణాలు లేవని, అందరూ సురక్షితంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. మరో ఇద్దరు మహిళలకు మాత్రం రిపీట్ టెస్టులోనూ ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలడంతో వారిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.

Read More : PM Modi : రావత్ మరణం ప్రతి దేశభక్తుడికీ లోటే..దేశాన్ని మరింత శక్తిమంతం చేస్తాం

కరోనా హబ్‌గా పేరున్న మహారాష్ట్రను కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ధారవిలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కాంటాక్టులను ట్రేస్ చేస్తున్నారు అధికారులు. కరోనా కట్టడికి ముంబయిలో రెండ్రోజుల పాటు 144సెక్షన్‌ విధించారు. మహారాష్ట్రలో 17 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. పింప్రీ- చించ్వాడలో ఒమిక్రాన్‌ సోకిన నలుగురిలో ముగ్గురు భారత సంతతికి చెందిన నైజీరియా మహిళలు ఉన్నారు. ఒమిక్రాన్ సోకిన ఏడుగురులో నలుగురు పూర్తిస్తాయి టీకా తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో అత్యధికంగా ఒమిక్రాన్‌ కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల్లో 50శాతానికి పైగా ఒమిక్రాన్‌ కేసులు మహారాష్ట్రలోనే రికార్డయ్యాయి. భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.