Omicron Symptoms : ఒమిక్రాన్ లక్షణాలివే… నిర్లక్ష్యం వద్దు

బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శని లవ్ అగర్వాల్ ప్రకటించారు.

10TV Telugu News

Omicron Symptoms : ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కర్నాటకలో రెండు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శని లవ్ అగర్వాల్ ప్రకటించారు. దేశంలో ఒమిక్రాన్ మరింత ప్రబలే అవకాశం ఉందని.. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించారు.

Read More : India Omicron : భారత్‌‌లోకి ఒమిక్రాన్ ఎంట్రీ..కర్నాటకలో రెండు కేసులు

ఒమిక్రాన్ లక్షణాలు
1.విపరీతమైన అలసట- తేలికపాటి కండరాల నొప్పులు

ఈ విపరీతమైన అలసట లక్షణం… వయసుతో సంబంధం లేకుండా ఒమిక్రాన్ సోకిన వారందరిలో కనిపించాయని సౌతాఫ్రికన్ మెడికల్ అసోసియేషన్ చైర్ పర్సన్ ఏంజెలిక్ కోయెట్జీ చెప్పారు. యువత అయనా.. కూడా వారిలో అలసట బాగా కనిపించిందని తెలిపారు.

2.గొంతులో గరగర

ఒమిక్రాన్ సోకిన వారిలో గొంతు దగ్గర దురద లాంటి లక్షణాలు కనిపించాయని పలు దేశాల్లో స్టడీస్ చెబుతున్నాయి.

3.పొడి దగ్గు.. కొంతమందిలో మాత్రమే జ్వరం

ఈ వేరియంట్ సోకిన వారిలో పొడి దగ్గు కనిపిస్తుందని… కొంతమందికి మాత్రమే జ్వరం వచ్చిందని రీసెర్చ్ లు చెబుతున్నాయి. చికెన్‌ గున్యా‌కు, ఒమిక్రాన్‌కు చాలా వరకు ఒకే లక్షణాలు వస్తాయంటున్నారు.

4.ఈసారి ఆక్సిజన్ షార్టేజ్ సమస్య లేదు

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ కారణంగా ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ఆక్సిజన్ షార్టేజ్ సమస్య రాలేదని సౌతాఫ్రికా పరిశోధనలు తెలిపాయి.

5. రుచి, వాసన సమస్యలు ఉండవు

ఫస్ట్ వేవ్ లో ఇండియాలో కరోనా సోకిన వారిలో ఎక్కువ శాతం మంది రుచి, వాసన కోల్పోయారు. ఐతే.. ఒమిక్రాన్ సోకిన వారిలో ఈ లక్షణాలు కనిపించలేదని సౌతాఫ్రికా వైద్య రంగ నిపుణులు తెలిపారు.

6. హాస్పిటలైజేషన్ అవసరం లేదు

ఒమిక్రాన్ ఎక్కువమందికి వేగంగా సోకుతుంది అనేది పరిశోధనల్లో తేలింది. ఐతే… దీని నుంచి జాగ్రత్తలు, మంచి ఆహారంతో తొందరగానే బయటపడొచ్చని.. హాస్పిటలైజ్ కావాల్సిన అవసరం లేదని సౌతాఫ్రికా సహా పలుదేశాల్లో కేసులను బట్టి తేలింది. ఎక్కువమందికి అలసట, అనారోగ్యం లాంటి సమస్య వస్తే.. ఎకానమీపై తీవ్ర ప్రభావం పడుతుంది కాబట్టి ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాయి.

Read More : Whatsapp Accounts Ban : భారతీయ యూజర్లకు భారీ షాక్.. 20లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్!

ఎయిర్ పోర్టుల్లో కఠిన చర్యలు : –
మరోవైపు… ఒమిక్రాన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో కఠిన చర్యలు అమలవుతున్నాయి. ప్రమాదం పొంచి ఉన్న జాబితాలోని దేశాల నుంచి వచ్చే పౌరులకు పరీక్షలు చేయడంతో పాటు కఠిన క్వారంటైన్ నియమాలు అమలవుతున్నాయి. ప్రయాణికులకు టెస్టులు చేసిన అనంతరం ఫలితం తేలకుండా ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేదని కండిషన్‌ పెట్టారు. టెస్టుల్లో నెగిటివ్ అని తేలితే ఏడు రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది. మహారాష్ట్రకు చేరుకునే ప్రయాణికులంతా తప్పనిసరిగా ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉండాలని నిబంధన పెట్టారు.

Read More : Delhi Pollution..Schools Closed: ఢిల్లీలో కాలుష్యం తగ్గట్లేదు..మరోసారి స్కూల్స్ మూసివేత..

విదేశీయులకు కొత్త నిబంధనలు : –
విదేశీయులకూ కొత్త నిబంధనలను వర్తింపజేస్తోంది. ప్రతి ఒక్కరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌ను విమానాశ్రయంలో అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. RT-PCR నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా ప్రొడ్యూస్ చేయాలి. ఇక ఎయిర్‌పోర్టుల్లో వైరస్ నిర్ధారణ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నెగెటివ్‌గా తేలిన తర్వాత కూడా 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ ఉండాలని ఆదేశించింది. కరోనా పాజిటివ్‌గా తేలిన ప్రయాణికుల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపిస్తారు. ఇక 14 రోజుల ట్రావెల్ హిస్టరీని తప్పనిసరిగా విమానాశ్రయం అధికారులకు అందజేయాలి. చివరి 14 రోజుల్లో ఏ దేశంలో పర్యటించారనే విషయాన్ని వివరించాల్సి ఉంటుంది. అటు వేగవంతమైన రిజల్ట్‌ కోసం ఎయిర్‌పోర్టుల్లోనే ర్యాపిడ్‌ RT-PCR టెస్టులు చేస్తున్నారు అధికారులు. ఈ ర్యాపిడ్‌ RT-PCR టెస్టుతో కేవలం 90నిమిషాల్లోనే రిజల్ట్‌ వస్తోంది.

×