Maharashtra Omicron : ఒమిక్రాన్ టెన్షన్…ముంబాయిలో 144 సెక్షన్

కరోనా కట్టడికి ముంబయిలో రెండ్రోజుల పాటు 144సెక్షన్‌ విధించారు. డిసెంబర్‌ 11, 12 రెండు రోజుల పాటు నగరంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని...

Maharashtra Omicron : ఒమిక్రాన్ టెన్షన్…ముంబాయిలో 144 సెక్షన్

Omicron Mumbai

Omicron Tension In Maharashtra : భారత్‌ను ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయం వెంటాడుతోంది. ఫుల్‌ డోస్‌ టీకా తీసుకున్నా.. వదలడంలేదు ఒమిక్రాన్‌. రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో నమోదైన తాజా ఒమిక్రాన్‌ కేసుతో దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య 33కు పెరిగింది. మహారాష్ట్రను కూడా వేరియంట్ వణికిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 7 కేసులు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ధారావిలో ఒమిక్రాన్ కేసు వెలుగు బయటపడడంతో ఆ ప్రాంతం మొత్తం వ‌ణికిపోయింది. రెండున్నర చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఏడు ల‌క్షల‌కు పైగా జ‌నాభా క‌లిగిన ప్రాంతం కావడంతో అక్కడి ప్రజలకు ఒమిక్రాన్‌ టెన్షన్‌ పట్టుకుంది.

Read More : Coronavirus Update : భారత్‌‌లో ఒమిక్రాన్ భయం, రెండు డోసులు తీసుకున్నా సోకుతోంది!

పాజిటివ్ వచ్చిన వ్యక్తి కాంటాక్టులను ట్రేస్ చేస్తున్నారు అధికారులు. జనసాంద్రత ఎక్కువగా ఉండే ధారావిలో ఒమిక్రాన్‌ తొలి కేసు బయటపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడికి ముంబాయిలో రెండ్రోజుల పాటు 144సెక్షన్‌ విధించారు. డిసెంబర్‌ 11, 12 రెండు రోజుల పాటు నగరంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ప్రకటించారు. నిషేధం ఉండడంతో ఊరేగింపులు, సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 17 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి.

Read More : Sai Teja : సాయితేజ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది-మంత్రి పెద్దిరెడ్డి

ఒమిక్రాన్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో బాధితుల కాంటాక్ట్‌లు చాలా వరకు కనిపించకుండా పోతున్నారు. వైరస్ భయాలతో వీరు పొరుగు రాష్ట్రాలకు కూడా పారిపోతున్నారని తెలుస్తోంది. దీంతో పొరుగు రాష్ట్రాలు.. ముఖ్యంగా గుజరాత్‌, మహారాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలకు కేసుల ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు…దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌, తాజా పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్‌ భేటీ సమావేశమైంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఐసీఎంఆర్ సూచించిన బూస్టర్‌ డోస్‌పైనా చర్చించే అవకాశం ఉంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో బూస్టర్‌ డోస్‌పై ఐసీఎంఆర్‌ కీలక సలహా ఇచ్చింది. రెండు వ్యాక్సిన్లు తీసుకున్నవారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని చెప్పింది. రెండో డోస్‌ తీసుకున్నవారికి 9 నెలల తర్వాత బూస్టర్‌ డోస్ ఇవ్వాలని పార్లమెంటరీ పానెల్‌కు సూచించింది.